Team India : టీ20ల్లో టీమ్ఇండియా వ‌ర‌ల్డ్ రికార్డు.. పాకిస్తాన్ మ‌న వెన‌కే..

Team India T20 Record : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ప‌రాభ‌వానికి భార‌త జ‌ట్టు టీ20ల్లో ప్ర‌తీకారం తీర్చుకుంది.

Team India

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 ఫైన‌ల్ మ్యాచులో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ప‌రాభ‌వానికి భార‌త జ‌ట్టు టీ20ల్లో ప్ర‌తీకారం తీర్చుకుంది. మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌ను కైవ‌సం చేసుకుంది. ఈ క్ర‌మంలో టీమ్ఇండియా టీ20ల్లో ప్ర‌పంచ రికార్డు నెల‌కొల్పింది. ఈ ఫార్మాట్‌లో అత్య‌ధిక విజ‌యాలు సాధించిన జ‌ట్టుగా నిలిచింది. ఈ క్ర‌మంలో పాకిస్తాన్ రికార్డును బ్రేక్ చేసింది.

శుక్ర‌వారం రాయ్‌పుర్‌లో ఆస్ట్రేలియాతో జ‌రిగిన నాలుగో టీ20 మ్యాచులో భార‌త జ‌ట్టు 20 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. టీ20ల్లో టీమ్ఇండియాకు ఇది 136 గెలుపు. 2006 నుంచి భార‌త జ‌ట్టు టీ20లు ఆడుతోంది. ఇప్ప‌టి వ‌ర‌కు 213 మ్యాచులు ఆడిన భార‌త్ 136 మ్యాచుల్లో గెలవ‌గా 67 మ్యాచుల్లో ఓడిపోయింది. ఓ మ్యాచ్ టైగా ముగియ‌గా మూడింటిలో ఎలాంటి ఫ‌లితం రాలేదు.

Mitchell Marsh : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ట్రోఫీ వివాదం.. ఎట్ట‌కేల‌కు స్పందించిన మిచెల్ మార్ష్‌.. ఇందులో త‌ప్పేముంది..?

రెండో స్థానంలో ఉన్న పాకిస్తాన్ జ‌ట్టు 226 మ్యాచులు ఆడ‌గా 135 మ్యాచుల్లో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది. న్యూజిలాండ్ 200 మ్యాచులు ఆడ‌గా 102 మ్యాచుల్లో గెలుపొంది మూడో స్థానంలో కొన‌సాగుతోంది. ఆ త‌రువాత ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాలు నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయి. ద‌క్షిణాఫ్రికా 171 మ్యాచుల్లో 95 మ్యాచుల్లో గెల‌వ‌గా, ఆస్ట్రేలియా 181 మ్యాచుల్లో 95 విజ‌యాలు సాధించింది.

రుతురాజ్ అరుదైన ఘ‌న‌త‌..

Ruturaj Gaikwad

నాలుగో టీ20 మ్యాచులో 32 ప‌రుగుల‌తో రాణించిన ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా నాలుగు వేల ప‌రుగులు సాధించిన భార‌త ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో కేఎల్ రాహుల్ రికార్డును బ్రేక్ చేశాడు. కేఎల్ రాహుల్ 117 ఇన్నింగ్స్‌లో ఈ ఘ‌న‌త‌ను అందుకోగా రుతురాజ్ 116 ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని చేరుకున్నాడు.

Pakistan Cricket Team : ఆస్ట్రేలియాలో పాకిస్తాన్ ఆట‌గాళ్ల‌కు ఘోర అవ‌మానం..! వీడియో

ఈ జాబితాలో క్రిస్‌గేల్ మొద‌టి స్థానంలో ఉన్నాడు. గేల్ 107 ఇన్నింగ్స్‌ల్లో నాలుగు వేల‌ ప‌రుగుల‌ను చేయ‌గా ఆ త‌రువాత షాన్‌మార్ష్ (113), బాబ‌ర్ ఆజాం(115), డేవాన్ కాన్వే (116) ఆ త‌రువాతి స్థానాల్లో ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు