India team using Vaseline to tamper the ball on Day 5 of Oval Test says Shabbir Ahmed
ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. ముఖ్యంగా లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ ఆఖరి రోజు ఆటను క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మరిచిపోలేరు. ఈ మ్యాచ్‌లో 6 పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌ను 2-2తో సమం చేసింది.
అయితే.. భారత జట్టు విజయాన్ని పాకిస్థాన్ మాజీ ఆటగాడు షబ్బీర్ అహ్మద్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతడు భారత్ పై ఉన్న అక్కసును మరోసారి వెళ్లగక్కాడు. టీమ్ఇండియా బాల్ టాంపరింగ్‌కు పాల్పడిందని ఆరోపించాడు. భారత బౌలర్లు బంతికి పెట్రోలియం జెల్లీని రాసి ఉంటారని ఆరోపణలు చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఉపయోగించిన డ్యూక్ బంతిని ల్యాబ్‌లో పరీక్షించాలని ఆయన డిమాండ్ చేశాడు.
“భారత బౌలర్లు బంతికి వ్యాజిలైన్ పూసిందని భావిస్తున్నాను. ఎందుకంటే 80 ఓవర్లు దాటిన తరువాత కూడా బంతి మెరుపు కోల్పోలేదు. అంపైర్ ఆ బంతిని ల్యాబ్ టెస్ట్‌కు పంపాలి.” అని తన సోషల్ మీడియా ఖాతాలో షబ్బీర్ రాసుకొచ్చాడు. అతడి ట్వీట్ వైరల్‌గా కాగా.. నెటిజన్లు అతడిపై మండిపడుతున్నారు. భారత జట్టు విజయాన్ని చూసి ఓర్వలేక ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నాడని అంటున్నారు.
1999 నుంచి 2007 వరకు షబ్బీర్ అహ్మద్ పాక్‌కు ప్రాతినిధ్యం వహించాడు. పాక్ తరుపున అతడు 10 టెస్టులు, 32 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. మొత్తంగా మూడు ఫార్మాట్లలో కలిపి 84 వికెట్లు తీశాడు.
Lords : పాపం నక్క బావా.. క్రికెట్ ఆడాలని వచ్చిందో.. పరుగు పందెం అని అనుకుందో.. వీడియో వైరల్..
అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా అతడి పై ఓ ఏడాది నిషేదం కూడా విధించారు. బౌలింగ్ యాక్షన్ సరిగ్గా లేదని అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ ఏడాది పాటు నిషేదాన్ని ఎదుర్కొన్న మొదటి ఆటగాడు అతడే కావడం గమనార్హం.