Lords : పాపం నక్క బావా.. క్రికెట్ ఆడాలని వచ్చిందో.. పరుగు పందెం అని అనుకుందో.. వీడియో వైరల్..
క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఒక్కొసారి అనుకోని అతిథులు వస్తూ ఉంటాయి.

The Hundred 2025 Opener fox invades field video viral
క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు ఒక్కొసారి అనుకోని అతిథులు వస్తూ ఉంటాయి. ఇటీవల శ్రీలంకలో మ్యాచ్ జరుగుతుండగా ఓ పాము మైదానంలోకి రావడాన్ని చూసే ఉంటాం. తాజాగా క్రికెట్‌కు పుట్టినిల్లు అయిన లండన్‌లోని లార్డ్స్ మైదానంలోకి ఓ అనుకోని అతిథి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ ఓ నక్క మైదానంలోకి వచ్చింది. దీంతో కాసేపు మ్యాచ్ ఆగిపోయింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ది హండ్రెడ్ 2025 సీజన్ జరుగుతోంది. ఈ టోర్నీలో భాగంగా లండన్ స్పిరిట్, ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్ల మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లండన్ జట్టు 94 బంతుల్లో 80 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవల్ ఇన్విన్సిబుల్స్ బౌలర్లలో సామ్ కరణ్, రషీద్ ఖాన్ లు చెరో మూడు వికెట్లు తీశారు. ఆ తరువాత ఓవల్ జట్టు 81 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది.
Team India : బుమ్రా నుంచి నాయర్ వరకు.. విండీస్‌తో సిరీస్‌కు ఈ ఏడుగురు ఆటగాళ్లకు చోటు కష్టమే?
There’s a fox on the field! 🦊 pic.twitter.com/3FiM2W90yZ
— Sky Sports Cricket (@SkyCricket) August 5, 2025
లండన్ స్పిరిట్ బౌలర్ డేనియల్ వోరాల్ బౌలింగ్ చేసేందుకు సిద్ధం అవుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఓ నక్క మైదానంలోకి వచ్చింది. గ్రౌండ్ మొత్తం అది పరిగెత్తింది. నక్కను చూసిన ఆటగాళ్లు, అంపైర్లు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. నక్క మైదానంలో తిరిగుతుండడంతో కాసేపు మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది.
Team India : నెలరోజులు టీమ్ఇండియా ఆటగాళ్లకు రెస్ట్.. ఎందుకో తెలుసా ?
కొద్ది సేపటి తరువాత నక్క మైదానం నుంచి బయటకు వెళ్లింది. అది ఎవ్వరికి ఎలాంటి అపాయం కలిగించకపోవడంతో ప్రేక్షకులు చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. నక్క వెళ్లిపోవడంతో మ్యాచ్ మళ్లీ మొదలైంది. 81 పరుగుల లక్ష్యాన్ని ఓవల్ జట్టు 69 బంతుల్లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
కాగా.. నక్క మైదానంలో పరిగెడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.