India vs Afghanistan: అఫ్గాన్‌తో తొలి టీ20 మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పులు.. పిచ్ వాళ్లకే అనుకూలం

అఫ్గాన్ తో మ్యాచ్ అంటే భారత్ జట్టుకు అంతఈజీ కాదు. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తరువాత అఫ్గాన్ పసికూన జట్టు అనే అభిప్రాయం తొలగిపోయింది.

IND Vs AFG

IND Vs AFG 1st T20 : మొహాలీ వేదికగా ఇవాళ రాత్రి 7గంటలకు అఫ్గానిస్థాన్ వర్సెస్ టీమిండియా జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాది టీ20 ప్రపంచ కప్ నేపథ్యంలో ఈ సిరీస్ ఆసక్తికరంగా మారింది. ఇరు జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్ లు జరగనుండగా.. మూడింటిలో విజయం సాధించాలని భారత్ జట్టు పట్టుదలతో ఉంది. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీస్ తరువాత రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో ఇప్పటి వరకు ఆడలేదు.. తాజాగా అఫ్గాన్ పై మళ్లీ టీ20 ఫార్మాట్ లోకి జట్టు సారథిగా అడుగుపెట్టబోతున్నాడు. కోహ్లీసైతం సుధీర్ఘకాలం తరువాత అఫ్గాన్ తో సిరీస్ కు ఎంపికైనప్పటికీ.. వ్యక్తిగత కారణాల వల్ల తొలి మ్యాచ్ ఆడటం లేదు. తరువాత జరిగే రెండు మ్యాచ్ లకు కోహ్లీ అందుబాటులో ఉంటాడని టీమిండియా కోచ్ రాహుల్ ద్రవిడ్ వెల్లడించాడు.

Also Reada : ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌ను అందుకే తీసుకోలేదు.. ద్రవిడ్ క్లారిటీ

కోహ్లీ తొలి మ్యాచ్ కు దూరమవ్వడంతో టీమిండియా బ్యాటింగ్ విభాగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఓపెనర్స్ గా రోహిత్ శర్మ, యశస్వి క్రీజులోకి రానున్నారు. శుభ్ మన్ గిల్ 3వ నవంబర్ లో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. కోహ్లీ గైర్హాజరుతో హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మకు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. వికెట్ కీపర్ స్థానంకోసం సంజూ శాంసన్, జితేశ్ మధ్య పోటీ నెలకొంది. వీరిద్దరిలో జితేశ్ కే తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో అవేష్ ఖాన్, అర్ష్ దీప్, ఆడనున్నారు. స్పిన్ విభాగంలో కుల్ దీప్ తుదిజట్టులో చేరడం ఖాయం. మరో స్థానం కోసం అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, సుందర్ రేసులో ఉన్నారు. అక్షర్ పటేల్ కు తుదిజట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.

Also Read : ICC Test Rankings: టెస్టు ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లోకి దూసుకొచ్చిన రోహిత్ శ‌ర్మ‌.. మెరుగైన విరాట్, బుమ్రా, సిరాజ్ ర్యాంకులు

అఫ్గాన్ తో మ్యాచ్ అంటే భారత్ జట్టుకు అంతఈజీ కాదు. గతేడాది వన్డే ప్రపంచ కప్ లో ఆ జట్టు ప్రదర్శన చూసిన తరువాత అఫ్గాన్ పసికూన జట్టు అనే అభిప్రాయం తొలగిపోయింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, మాజీ ఛాంపియన్లు పాకిస్థాన్, శ్రీలంకపై ఆ జట్టు విజయాలు సాధించింది. అదేమీ గాలివాటం విజయంకూడా కాదు. ఆస్ట్రేలియానుసైతం అఫ్గాన్ జట్టు భయపెట్టింది. వన్డే ప్రపంచ కప్ లో అద్భుతంగా రాణించిన ఆజట్టు టీ20ల్లో మరింత చెలరేగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అఫ్గాన్ జట్టును తేలిగ్గా తీసుకుంటే టీమిండియా ఇబ్బందులను కొనితెచ్చుకున్నట్లే అవుతుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయ పడుతున్నారు. అయితే, అఫ్గాన్ జట్టుకు రషీద్ లేకపోవటం దెబ్బేనని చెప్పొచ్చు. రషీద్ లేకపోయినా యువ స్పిన్నర్లు నూర్ అహమ్మద్, మజీబ్, నబీ నుంచి భారత్ జట్టుకు సవాలు ఎదురయ్యే అవకాశం ఉంది.

Also Read : MS Dhoni : ధోనీ మొదలెట్టాడు.. ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ ప్రారంభించిన తలైవా.. వీడియో వైరల్

మోహాలీ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే, ఆరంభంలో పేసర్లకు, ఆట సాగుతున్నా కొద్దీ స్పిన్నర్లకూ పరిస్థితులు సహకరిస్తాయి. ఇక్కడ ఆరు టీ20 మ్యాచ్ లు జరగ్గా.. ఛేదనకు దిగిన జట్లు నాలుగు సార్లు విజయం సాధించాయి. అఫ్గానిస్థాన్ తో ఇప్పటి వరకు టీమిండియా ఐదు టీ20 మ్యాచ్ లు ఆడగా.. నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించింది.. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.

 

భారత్ జట్టు అంచనా: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్)/ జితేశ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్, కుల్దీప్ యాదవ్/రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్.

ఆఫ్ఘనిస్తాన్ జట్టు అంచనా : హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ (WK), ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఉమర్జాయ్, ముజీబ్-ఉర్-రెహ్మాన్, షరాఫుద్దీన్ అష్రఫ్, కైస్ అహ్మద్, నూర్ ఎఫ్-ఉల్-నవీన్.

 

 

ట్రెండింగ్ వార్తలు