Ind vs Aus A ప్రాక్టీస్ మ్యాచ్ డ్రా

India vs australia A : భారత్ , అస్ట్రేలియా ఏ మధ్య జరిగిన మొదటి ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆఖరి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా ఏ జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 307 పరుగులు సాధించింది. ఆస్ట్రేలియా ఏ నుంచి మెక్ డెర్మాట్ 107, జాక్ వైల్డర్‌మత్ 111 పరుగులు సాధించారు. అలెక్స్ కేరీ 58 పరుగులు చేశారు. షమీకి రెండు, హనుమ విహారి, సిరాజ్‌లకు తలో ఓ వికెట్ దక్కింది.
చివరి రోజు 473 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియాకు భారత్ బౌలర్ల నుంచి గట్టి పోటీ ఎదురైంది. షమీ, సిరాజ్‌ల దాటికి 25 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. దీంతో భారత్ గెలుపు దిశగా సాగుతున్నట్టు అనిపించినా మెక్ డెర్మాట్, జాక్ వైల్డర్‌మత్, అలెక్స్ కేరీలు భారత బౌలర్ల జోరుకు బ్రేకులు వేశారు. తొలి ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఊహించినదాని కంటే భారత్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. స్టార్ బ్యాట్స్‌మన్ లేకపోయినా.. ఎక్కడా ఆసీస్‌కు ఆధిక్యత ఇవ్వలేదు. తొలి ఇన్సింగ్స్ మినహాయిస్తే మిగిలిన మూడు ఇన్సింగ్సుల్లో భారత ఆటగాళ్లు చక్కని ప్రదర్శన కనబరిచారు. ముఖ్యంగా ఆల్‌రౌండర్ హనుమ విహారి ఇటు బ్యాటు, అటు బాల్‌తో ఆకట్టుకున్నాడు. మెరుపు సెంచరీ సాధించిన పంత్ టచ్‌లోకి వచ్చాడు. డిసెంబరు 17న ఇండియా తొలి టెస్టు ఆడనుంది. అంతకు ముందు వార్మప్ మ్యాచ్ ఆడనుంది.
మరోవైపు..దేశవాళీ క్రికెట్‌కు బీసీసీఐ ఆదివారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ-20 టోర్నమెంట్ నిర్వహణకు ఓకే చెప్పింది. ఈమేరకు బీసీసీఐ కార్యదర్శి జైషా అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు సమాచారం ఇచ్చారు. కరోనా వైరస్ కారణంగా దాదాపు ఏడాది తర్వాత దేశవాళీ క్రికెట్ అభిమానులను అలరించనుంది.