IND vs AUS Test Series: ఆస్ట్రేలియా, భారత్ మొదటి టెస్టు.. ఏ సమయానికి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది.. సెషన్స్ టైమింగ్స్ వివరాలు ఇలా..

ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది.

IND vs AUS 1st Test

Border Gavaskar Trophy: బోర్డర్ గావస్కర్ ట్రోపీ – 2024లో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ ఈనెల 22న పెర్త్ లో ప్రారంభం అవుతుంది. ఇప్పటికే పెర్త్ కు చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టుల్లో భారత్ జట్టు ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో పెర్త్ లో జరిగే తొలి టెస్టులో విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. దీనికితోడు డబ్ల్యూటీసీ ఫైనల్ కు భారత్ జట్టు చేరాలంటే.. ఆస్ట్రేలితో జరిగే ఐదు టెస్టు మ్యాచ్ లలో నాలుగు మ్యాచ్ లలో విజయం సాధించాల్సి ఉంది. దీంతో పెర్త్ లో జరిగే మొదటి టెస్టులో విజయంతో సిరీస్ ను ప్రారంభించాలని భారత్ ఆటగాళ్లు కసరత్తు చేస్తున్నారు.

Also Read: AUS vs IND : బీచ్‌లో సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్

ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది. తొలి టెస్టు ఉదయం 7.50 గంటల నుంచి మధ్యాహ్నం 2.50 గంటల వరకు కొనసాగుతుంది.
సెషన్స్ వారిగా సమయం ఇలా..
మొదటి సెషన్ – 7.50 నుంచి 9.50 వరకు
రెండో సెషన్ – 10.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు
మూడో సెషన్ – మధ్యామ్నం 12.50 నుంచి మధ్యాహ్నం 2.50 గంటల వరకు జరుగుతుంది.