AUS vs IND : బీచ్‌లో సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు.. వీడియో వైరల్
కొద్దిరోజులుగా పెర్త్ మైదానంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు క్రికెటర్లు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Teamindia Cricketrs
KL Rahul: ఆస్ట్రేలియా వేదికగా జరగబోయే బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భారత్, ఆసీస్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ లు జరగనున్నాయి. మొదటి టెస్ట్ మ్యాచ్ ఈనెల 22 నుంచి పెర్త్ వేదికగా ప్రారంభమవుతుంది. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటికే పెర్త్ కు చేరుకున్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మూడు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్ జట్టు మూడు టెస్టుల్లో ఓడిపోయింది. దీంతో ఆస్ట్రేలియా టూర్ ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పెర్త్ మైదానంలో భారత ఆటగాళ్లు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే, తాజాగా కొందరు క్రికెటర్లు బీచ్ లో సందడి చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
టీమిండియా క్రికెటర్ కెఎల్ రాహుల్ తో పాటు ప్రసిద్ధ్ కృష్ణ, దేవదత్ పడిక్కల్, ధృవ్ జురెల్ బీచ్, దాని పరిసరాల్లో సేదతీరుతున్న వీడియోను కెఎల్ రాహుల్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదిలాఉంటే పెర్త్ లో జరిగే మొదటి టెస్టులో కెఎల్ రాహుల్ ఆడటం దాదాపు ఖాయమైంది. అతను ఓపెనింగ్ బ్యాటరుగా క్రీజులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఓపెనర్ శుభమాన్ గిల్ బొటనవేలికి గాయం కారణంగా మొదటి టెస్టుకు దూరమయ్యాడు. దీంతో అతని స్థానంలో రాహుల్ క్రీజులోకి వస్తాడని సమాచారం.
View this post on Instagram