AUS vs IND Test Series: విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆస్ట్రేలియా సిరీస్ చివ‌రిదా.. గంగూలీ ఏం చెప్పాడంటే?

కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు.

AUS vs IND Test Series: విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆస్ట్రేలియా సిరీస్ చివ‌రిదా.. గంగూలీ ఏం చెప్పాడంటే?

Sourav Ganguly and Virat Kohli

Updated On : November 18, 2024 / 10:40 AM IST

virat kohli : బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియాతో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ లో మొదటి టెస్ట్ ఈనెల 22న పెర్త్ లో ప్రారంభం అవుతుంది. అయితే, భారత్ జట్టు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. స్వదేశంలో ఇటీవల న్యూజిలాండ్ సిరీస్ లో దారుణ ఓటమిని చవిచూసిన భారత్ జట్టు.. ఆస్ట్రేలియా సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, సిరీస్ ప్రారంభానికి ముందే జట్టును గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే బొటనవేలు గాయం కారణంగా శుభమాన్ గిల్ మొదటి టెస్టుకు దాదాపు దూరమయ్యాడు. మరోవైపు మహ్మద్ షమీ కూడా లేకపోవటంతో బౌలింగ్ విభాగంలోనూ భారత్ కాస్త బలహీనంగానే ఉందని చెప్పొచ్చు. రోహిత్ శర్మ కూడా తొలి టెస్టుకు అందుబాటులో ఉండటం కష్టమే. ఈ నేపథ్యంలో బ్యాటింగ్ విభాగాన్ని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందుకు నడిపించాల్సిన బాధ్యత ఉంది.

Also Read: AUS Vs IND: రోహిత్ శర్మ కెప్టెన్సీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. హర్భజన్ సింగ్ రియాక్షన్

విరాట్ కోహ్లీ ఫామ్ ఆందోళనకరంగా ఉంది. అతను స్వదేశంలో న్యూజిలాండ్ తో మూడు టెస్టు మ్యాచ్ లలో ఆరు ఇన్నింగ్స్ లలో కేవలం 93 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అంతేకాక.. 2023లో వెస్టిండీతో జరిగిన మ్యాచ్ లో అతను సెంచరీ చేశాడు. ఆ తరువాత ఇప్పటి వరకు సెంచరీ చేయలేదు.. దాదాపు పదహారు నెలలు అవుతుంది. అయితే, కోహ్లీ బ్యాటింగ్ సమర్ధతపై మాజీ కెప్టెన్ సౌరభ్ గుంగూలీ Revsportsతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీకి ఇది చివరి ఆస్ట్రేలియా పర్యటన కావచ్చు. ఆస్ట్రేలియాతో సిరీస్ లో కోహ్లీ మళ్లీ ఫాంలోకి వస్తాడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read: ఏంటి ‘పుష్ప3’లో నటిస్తావా..! తిలక్ వర్మను ఆటపట్టించిన సూర్యకుమార్ యాదవ్.. ఫన్నీ వీడియో వైరల్

కోహ్లీ ఒక ఛాంపియన్ బ్యాటర్. అతను గతంలో ఆస్ట్రేలియాలో జరిగిన టెస్టుల్లో మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. 2014లో నాలుగు సెంచరీలు, 2018లో కూడా సెంచరీ సాధించాడు. కోహ్లీ ఈ సిరీస్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు  టెస్టు క్రికెట్ ఆడటానికి ఆస్ట్రేలియాలో పర్యటించడం ఇదే చివరి సిరీస్ అని అతనికి తెలుసు. కాబట్టి ప్రతికోణంలో కోహ్లీకి ఇది ప్రతిష్టాత్మక సిరీస్ అవుతుందని గంగూలీ అన్నారు. స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుపై ఓటమి గురించి గంగూలీ మాట్లాడుతూ.. నేను న్యూజిలాండ్ సిరీస్ గురించి పెద్దగా చర్చించాలని అనుకోవడం లేదు. ఎందుకంటే.. పిచ్ బ్యాటింగ్ కు అవకాశం ఇవ్వలేదు. ఆస్ట్రేలియాలో పిచ్ లు వేరేలా ఉంటాయి. ఈ సిరీస్ ను కోహ్లీ సద్వినియోగం చేసుకొని తిరిగి ఫామ్ లోకి వస్తాడనే గంగూలీ ధీమా వ్యక్తం చేశారు.