AUS Vs IND: రోహిత్ శర్మ కెప్టెన్సీపై గవాస్కర్ కీలక వ్యాఖ్యలు.. హర్భజన్ సింగ్ రియాక్షన్
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలోని మొదటి మ్యాచ్ తుది జట్టులో ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది. ఒకవేళ సర్ఫరాజ్ తొలి టెస్టులో పరుగులు రాబట్టడంలో ..

Harbhajan Singh
Harbhajan Singh: బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభం కానుంది. తొలి టెస్టు ఈనెల 22న పెర్త్ లో జరగనుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియాకు చేరుకొని ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ టెస్టు సిరీస్ భారత్ జట్టుకు ఎంతో కీలకమైంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు చేరుకోవాలంటే టీమిండియా సిరీస్ ను గెలుచుకోవాల్సి ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా సిరీస్ ను భారత్ జట్టు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే, ఆస్ట్రేలియాపై టీమిండియా విజయావకాశాలపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
హర్భజన్ సింగ్ ఓ యూట్యూబ్ ఛానెల్ లో మాట్లాడుతూ.. ఈ సిరీస్ లో ఇరు జట్ల విజయావకశాలు 50:50 ఉన్నాయని తెలిపాడు. ఇటీవల న్యూజిలాండ్ తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది. టీమిండియా బ్యాటర్లు ఈ సిరీస్ లో ఘోరంగా విఫలమయ్యారు. అయితే సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోపీ ఆడాలని కొందరు మాజీలు అంటున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో పరిస్థితులు వేరు. పిచ్ లు బాగుంటాయని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. న్యూజిలాండ్ సిరీస్ లో కేఎల్ రాహుల్ పై విమర్శలు వచ్చాయి. అయితే, క్రీజులో ఎక్కువసేపు నిలవగలిగే.. బంతికి ఓపిగ్గా ఎదుర్కోగలిగే పుజరా వంటి ఆటగాడు మనకు అవసరమని నేను భావిస్తున్నా. ఈ సిరీస్ లో ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉండబోతోంది. ఎందుకంటే టీమిండియా ఆత్మవిశ్వాసం కాస్త సడలింది అని హర్భజన్ పేర్కొన్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోపీలోని మొదటి మ్యాచ్ తుది జట్టులో ధృవ్ జురెల్ కంటే సర్ఫరాజ్ ఖాన్ ను ఎంపిక చేస్తే బాగుంటుంది. ఒకవేళ సర్ఫరాజ్ తొలి టెస్టులో పరుగులు రాబట్టడంలో విఫలమైతే అతని స్థానంలో ధృవ్ మాత్రమే ఉండాలని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియా తొలి టెస్టులో రోహిత్ శర్మ అందుబాటులోకి రాకుంటే.. జస్ప్రీత్ బుమ్రాను మొత్తం సిరీస్‌కు కెప్టెన్‌గా నియమించాలని భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై హర్భజన్ మాట్లాడుతూ.. ఇది చెడ్డ ఆలోచన కాకపోవచ్చు. బుమ్రాకు జట్టును నడిపించే సత్తా ఉన్నందున ఎలాంటి సమస్య ఉండకూడదని హర్భజన్ గవాస్కర్ సూచనకు మద్దతు పలికాడు.