Abhishek Sharma
Abhishek Sharma: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 4-1 తేడాతో గెలుచుకుంది. చివరి మ్యాచ్ ఆదివారం రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. దీంతో ఇంగ్లాండ్ జట్టుపై టీమిండియా 150 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 54 బంతుల్లోనే 135 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఏడు ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు. అభిషేక్ శర్మ అద్భుత ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల హృదయాలను గెలుచుకుంది. దీనికితోడు మాజీ, తాజా క్రికెటర్లు అభిషేక్ ఇన్నింగ్స్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూడా అభిషేక్ ఇన్నింగ్స్ పై ట్విటర్ (ఎక్స్) లో ఆసక్తికర పోస్టు చేశారు. సచిన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సచిన్ టెండూల్కర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో అభిషేక్ శర్మ సెంచరీ చేసిన వీడియోను పోస్టు చేశారు. ఈ వీడియోకు మెరుపు ఎమోజీతోపాటు.. తుఫాన్ ఎమోజీని పెట్టి 100 అంటూ అభిషేక్ శర్మను సచిన్ అభినందించారు. సచిన్ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేవిధంగా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మెంటల్ నా కొడుకు అంటూ ఓ ఫోటోను పోస్ట్ చేయగా వైరల్ అవుతోంది.
⚡️💨 💯 Abhishek Sharma!pic.twitter.com/Kg2L2kdXW2
— Sachin Tendulkar (@sachin_rt) February 2, 2025
ఆదివారం వాఖండే స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. అతను తీసుకున్న నిర్ణయం ఎంతతప్పు అని తెలుసుకునేందుకు కొద్దిసమయం కూడా పట్టలేదు. అభిషేక్ శర్మ క్రీజులోకి వచ్చిన దగ్గరనుంచి సిక్సులు, ఫోర్లతో విరుచుకుపడటంతో జోస్ బట్లర్ అలాగే చూస్తుండిపోయాడు. కేవలం 17 బంతుల్లోనే హాప్ సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ.. 37 బంతుల్లో సెంచరీ నమోదు చేశాడు. సెంచరీ తరువాత కూడా అభిషేక్ శర్మ దూకుడు ఆగలేదు. 135 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా 247 పరుగులు చేసింది.
Also Read: IND vs ENG : అభిషేక్ శర్మ ఆల్‌రౌండ్ షో.. ఐదో టీ20లో ఇంగ్లాండ్ పై భారత్ ఘన విజయం
భారీ లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ 10.3 ఓవర్లలో 97 పరుగులకే ఆలౌట్ అయింది. భారత్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివమ్ దూబె, అభిషేక్ శర్మలు తలా రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈనెల 6వ తేదీ నుంచి ఇంగ్లాండ్ జట్టుతో భారత్ జట్టు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది.
𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜! 🏆
Congratulations to the Suryakumar Yadav-led #TeamIndia on the T20I series win! 👏 👏#INDvENG | @IDFCFIRSTBank | @surya_14kumar pic.twitter.com/QvgUH8iClq
— BCCI (@BCCI) February 2, 2025