IND vs ENG : నాల్గో టెస్ట్ కోసం టీమిండియాలో కీలక మార్పులు.. రోహిత్ తరువాత ఎవరు?

నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు.

IND vs ENG 4th Test : భారత్ వేదికగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే మూడు మ్యాచ్ లు పూర్తికాగా.. భారత్ 2-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇండియా – ఇంగ్లండ్ నాల్గో టెస్ట్ రాంచీలో ఈనెల 23 నుంచి జరుగుతుంది. ఈ టెస్టు జట్టులో కీలక మార్పులు చోటు చేసుకోనున్నట్లు తెలిసింది. ఇప్పటికే నాల్గో టెస్టుకు ఫాస్ట్ బౌలర్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. అతనికి బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. మరో సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్ నెస్ లేకపోవటంతో నాల్గో టెస్టుకు దూరమయ్యాడు.

Also Read : సర్ఫరాజ్ ఖాన్ నెం.97 జెర్సీని ఎందుకు ధరిస్తాడో తెలుసా? సర్ఫరాజ్ తండ్రికి.. ఆ జెర్సీకి సంబంధం ఏమిటి..

నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్, స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా అందుబాటులో ఉండటం లేదు. కేఎల్ రాహుల్ కూడా దూరమయ్యాడు. గతంలో వైస్ కెప్టెన్లుగా చేసిన ఇద్దరు ప్లేయర్లు లేకపోవటంతో రోహిత్ శర్మ తరువాత మ్యాచ్ ను లీడ్ చేసేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది. అయితే, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, శుభమన్ గిల్ లో ఎవరి పేరును నాల్గో టెస్టుకు వైస్ కెప్టెన్ గా బీసీసీఐ ప్రకటిస్తుందనేది చూడాలి.

Also Read : Rishabh Pant : ఐపీఎల్‌కు సిద్ధం.. వికెట్ కీపింగ్ ప్రాక్టీస్ మొదలెట్టిన రిషబ్ పంత్.. వీడియో వైరల్

మరోవైపు నాల్గో టెస్టు లో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కు తుది జట్టులో అవకాశం దక్కనున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో ముఖేష్ కుమార్, రాహుల్ స్థానాన్ని రజత్ పట్టీదార్ భర్తీ చేస్తారని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో ఆకాశ్ దీప్ పేరు తెరపైకి వచ్చింది. 2019లో సయ్యద్ ముస్తాక్ అలీ కప్ సిరీస్ లో బెంగాల్ జట్టుకు ఆకాశ్ దీప్ అరంగేట్రం చేశాడు. అద్భుతమైన బౌలింగ్ తో ఆ సిరీస్ లో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్ లో రాయల్ చాలెంజర్స్ జట్టుకు ఎంపికయ్యాడు. ఐపీఎల్ సిరీస్ లో ఆకాశ్ దీప్ ఏడు మ్యాచ్ లు ఆడి ఏడు వికెట్లు తీసుకున్నాడు. దీంతో నాలుగో మ్యాచ్ లో ఆకాశ్ దీప్ కు అవకాశం దక్కుతుందని సమాచారం. ఆకాశ్ కు అవకాశం దక్కితే ముఖేష్ కుమార్ కు తుది జట్టులో అవకాశం దక్కకపోవచ్చు.

 

 

 

ట్రెండింగ్ వార్తలు