×
Ad

IND vs NZ : ఇలా అయితే వాళ్లతో కష్టమే..! అందుకే ఓడిపోయాం.. ఓటమిపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ సంచలన కామెంట్స్..

IND vs NZ : టీమిండియాకు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. దీనికితోడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో తొలి బంతి నుంచి భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారని కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ అన్నారు.

Mitchell Santner

  • భారత్ వర్సెస్ న్యూజిలాండ్ రెండో టీ20 మ్యాచ్
  • ఏడు వికెట్ల తేడాతో భారత జట్టు విజయం
  • భారత బ్యాటింగ్ పై కివీస్ కెప్టెన్ సాంట్నర్ కీలక కామెంట్స్

IND vs NZ : ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది.. భారీ లక్ష్యాన్ని టీమిండియా కేవలం 15.2 ఓవర్లలోనే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసి విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ భారత్ బ్యాటింగ్ తీరుపై కీలక కామెంట్స్ చేశారు.

Also Read : Ind Vs NZ: సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్.. రెండో టీ20లో భారత్ ఘనవిజయం

భారత బ్యాటర్ల ముందు మా బౌలర్లు తేలిపోయారు. తాము ఇంకాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది. బ్యాటింగ్‌లోనూ దాటిగా ఆడాల్సిన అవసరం ఉందని మిచెల్ సాంట్నర్ పేర్కొన్నారు. ఇదే క్రమంలో టీమిండియా బ్యాటింగ్ పై కీలక కామెంట్స్ చేశాడు. టీమిండియా ముందు 300 పరుగుల లక్ష్యం కూడా చిన్నబోయేలా ఉందని చమత్కరించాడు. భారత జట్టుపై లక్ష్యాన్ని కాపాడుకోవాలంటే 300 పరుగులు చేయాలేమో.. అవి కూడా సరిపోతాయనే గ్యారెంటీ లేదు అంటూ సాంట్నర్ పేర్కొన్నాడు.


టీమిండియాకు మంచి బ్యాటింగ్ డెప్త్ ఉంది. దీనికితోడు పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో తొలి బంతి నుంచి భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టారు. మేము ఇంకాస్త కట్టుదిట్టంగా బౌలింగ్ చేయాల్సింది. బ్యాటింగ్ లోనూ ఇంకాస్త దూకుడుగా ఆడాల్సి ఉంది. మా జట్టులోకి ఇంకా కొంత మంది కీలక ప్లేయర్స్ రావాల్సి ఉంది. ప్రపంచకప్ ఆరంభ సమయానికి అందరూ ఫామ్‌లో ఉండాలని మేం కోరుకుంటున్నాం. అందుకోసం ఈ మ్యాచ్ తరహాలోనే ఆటగాళ్లను రొటేట్ చేయాల్సి రావచ్చు.

ఈ టీ20 సిరీస్ మేం గెలవాలని కోరుకుంటున్నాం. తిరిగి పుంజుకుంటాం. సిరీస్ కైవసం దిశగా మా ఆటతీరును మెరుగుపర్చుకుంటాం అని సాంట్నర్ చెప్పారు. ఈ మ్యాచ్‌లో మంచు తీవ్ర ప్రభావం చూపింది. స్పిన్నర్‌గా తడి బంతిని పట్టుకోవడం కొంచెం సవాల్‌తో కూడుకున్న పని. కానీ, ఇక్కడ మిగిలిన చోట్ల కంటే కొంచెం చలిగా ఉంది. మేం ఈ కండిషన్స్‌కు అలవాటు పడి తదుపరి మ్యాచ్‌లో మంచు ప్రభావం ఎలా ఉంటుందో చూసుకొని ముందుకెళ్తామని మిచెల్ సాంట్నర్ అన్నారు.