Ind Vs NZ: సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ విధ్వంసకర బ్యాటింగ్.. రెండో టీ20లో భారత్ ఘనవిజయం
తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది.
Ishan Kishan Suryakumar Yadav Pic Credit @ EspnCricInfo
- న్యూజిలాండ్ పై భారత్ సంచలన విజయం
- భారీ లక్ష్యాన్ని చేజ్ చేసిన టీమిండియా
- హాఫ్ సెంచరీలతో చెలరేగిన ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్
Ind Vs NZ: రెండో టీ20 మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ ను చిత్తు చేసింది. మరో 28 బంతులు మిగిలి ఉండగానే భారీ లక్ష్యాన్ని ఫినిష్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగుల భారీ స్కోర్ చేసింది. 209 పరుగుల లక్ష్యాన్ని 15.2 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ చేధించింది. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ సంచలన బ్యాటింగ్ చేశారు. హాఫ్ సెంచరీలతో చెలరేగారు.
ఇషాన్ 32 బంతుల్లో 76 పరుగులు బాదాడు. అతడి ఇన్నింగ్స్ లో 4 సిక్సులు, 11 ఫోర్లు ఉన్నాయి. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంకసర బ్యాటింగ్ చేశాడు. 37 బంతుల్లోనే 82 పరుగులు బాది జట్టుకి విజయాన్ని అందించాడు. సూర్య ఇన్నింగ్స్ లో 4 సిక్సలు, 9 ఫోర్లు ఉన్నాయి. మరో ఎండ్ లో శివమ్ దూబె మెరిశాడు. 18 బంతుల్లో 36 రన్స్ తో రాణించాడు. దూబె 3 సిక్సులు కొట్టాడు.
