India vs Pakistan: హాఫ్ సెంచరీ బాదిన ఫర్హాన్.. టీమిండియా లక్ష్యం ఎంతంటే?

ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్ మొదట బౌలింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే.

India vs Pakistan

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న మ్యాచులో పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్ మొదట బౌలింగ్‌ ఎంచుకున్న విషయం తెలిసిందే.

ఓపెనర్‌గా దిగిన సహిబ్‌జాదా ఫర్హాన్ ధాటిగా ఆడి 58 పరుగులు చేశాడు. ఫఖర్ జమాన్ 15, సయీమ్ అయూబ్ 21, హుస్సేన్ తాలత్ 10, మహ్మద్ నవాజ్ 21, సల్మాన్ ఆఘా 17, ఫహీమ్ అష్రఫ్ 20 పరుగులు బాదారు.

Also Read: ఒక్కసారిగా దొంగలుగా మారిన ప్రయాణికులు.. ఫస్ట్ క్లాస్‌ ఏసీ కోచ్‌లో వీటిని మాయం చేసి.. వీడియో వైరల్‌

టీమిండియా బౌలర్లలో శివం దూబే 2 వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.

కాగా, ఆసియా కప్‌లో భారత్‌-పాకిస్థాన్‌ 2018లో తలపడ్డాయి. ఆ సమయంలో గ్రూప్‌ దశతో పాటు సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపొందింది. ఇప్పుడు కూడా ఇదే రిపీట్ అవుతుందా? లేదా? అసక్తి నెలకొంది. విజయం సాధించాలంటే భారత్‌ 172 పరుగులు చేయాలి.

Also Read: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని భారత కెప్టెన్‌