India vs Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని భారత కెప్టెన్‌

గ్రూప్‌ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే.

India vs Pakistan: పాకిస్థాన్‌తో మ్యాచ్‌.. మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వని భారత కెప్టెన్‌

Suryakumar Yadav

Updated On : September 21, 2025 / 8:05 PM IST

India vs Pakistan: ఆసియా కప్ 2025లో భాగంగా భారత్‌, పాకిస్థాన్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచులో టాస్‌ గెలిచిన భారత్ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. భారత తుది జట్టులోకి జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి మళ్లీ వచ్చారు.

మళ్లీ పాక్‌ కెప్టెన్‌కు షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు భారత కెప్టెన్‌ సూర్యకుమార్ యాదవ్. గ్రూప్‌ దశలో ఇప్పటికే పాకిస్థాన్‌ను భారత్‌ ఏడు వికెట్ల తేడాతో ఓడించిన విషయం తెలిసిందే. ఆ మ్యాచులోనూ పాక్‌ కెప్టెన్‌కు భారత కెప్టెన్ షేక్‌హ్యాండ్‌ ఇవ్వలేదు. “ఆపరేషన్‌ సిందూర్” వేళ ఇరు దేశాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్న నేపథ్యంలో పాక్‌తో క్రికెట్‌ ఆడొద్దన్న డిమాండులు కూడా ఉన్నాయి.

కాగా, 2008లో ముంబై ఉగ్రదాడుల వేళ టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌లకు ముగింపు పలికింది. ఐసీసీ, ఏసీసీ టోర్నీల్లో మాత్రమే పాక్‌తో ఆడుతోంది.

ఆ తర్వాత 2018లో 6 జట్లు ఆసియా కప్‌లో ఆడాయి. ఆ సమయంలో గ్రూప్‌ దశలో, సూపర్-4లో పాకిస్థాన్‌పై టీమిండియా గెలుపొందింది. ఫైనల్‌లో చేరిన బంగ్లాను ఓడించి భారత్‌ కప్‌ కొట్టింది.

భారత్‌ 2022లో ఆసియా కప్‌లో ఫైనల్‌కు చేరుకోలేదు. గ్రూప్‌ దశలో పాక్‌ను ఓడించింది, సూపర్-4లో పాకిస్థాన్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక, పాకిస్థాన్‌ ఫైనల్‌కు వెళ్లాయి. శ్రీలంక కప్ కొట్టింది.

ఆసియా కప్‌ 2023లో పాక్‌తో రెండు మ్యాచులు ఆడాల్సి ఉండగా, మొదటి మ్యాచ్‌ వర్షార్పణం అయింది. సూపర్‌-4లో పాక్‌పై భారత్‌ గెలిచింది. ఫైనల్‌లోనూ శ్రీలంకపై గెలిచింది.

Also Read: 3.69 కోట్లు ఇచ్చింది.. యువకుడితో అతడి భార్యను విడదీసింది.. అతడితో ఏడాది ఉండి.. ఇప్పుడు ఆ డబ్బంతా ఇచ్చేయాలంటూ..

నేటి మ్యాచులో భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

పాకిస్థాన్ జట్టు: సైమ్ అయూబ్, సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్