పూణె టెస్టులో భారత బౌలర్లు విజృంభించారు. ఫాలోఆన్ ఆడుతున్న సఫారీలను భారత బౌలర్లు బెంబేలెత్తిస్తున్నారు. వరుస విరామాల్లో వికెట్లు పడగొడుతూ కోలుకోలేని దక్షినాఫ్రికాను కోలుకోలేని దెబ్బతీశారు. భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే ఇన్నింగ్స్ తేడాతో విజయం సాధించడం ఖాయంగా చెప్పుకోవచ్చు. ఆదివారం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా..మరోసారి దెబ్బతీశారు.
భోజన విరామం తర్వాత 45 ఓవర్లకు సఫారీల జట్టు ఏడు వికెట్లు కోల్పోయి..129 పరుగులు చేసింది. డీన్ ఎల్గర్ (48), తెంబ బవుమా (38) మినహా..మిగతా బ్యాట్స్‌మెన్స్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత్ ఇంకో మూడు వికెట్లు పడగొడితే..మూడు టెస్టుల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్, జడేజా రెండు వికెట్లు తీయగా, ఉమేశ్, షమి, ఇషాంత్ తలో వికెట్ తీశారు.
రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకే దక్షిణాఫ్రికా కుప్పకూలింది. 36 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడిన సఫారీలను… ముగ్గురు బ్యాట్స్‌మెన్ ఆదుకున్నారు. కేశవ్ మహరాజ్, ఫిలాండర్ అద్భుతంగా పోరాడారు. టాప్‌ఆర్డర్ తడబడ్డా వీరిద్దరూ భారత బౌలర్లకు పరీక్ష పెట్టారు. కెప్టెన్ డుప్లెసిస్ కూడా 64 పరుగులతో రాణించాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగుల చేసింది.
Read More : భారత్ – సౌతాఫ్రికా టెస్టు మ్యాచ్..మళ్లీ బ్యాటింగేనా