IND vs SL 2nd ODI 2024: 32 పరుగుల తేడాతో భారత్‌పై శ్రీలంక గెలుపు

తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం విదితమే.

IND vs SL 2nd ODI 2024: 32 పరుగుల తేడాతో భారత్‌పై శ్రీలంక గెలుపు

Pic Credit: @BCCI Twitter

Updated On : August 4, 2024 / 10:08 PM IST

భారత్ ఓటమి
రెండో వన్డేలో శ్రీలంక చేతిలో భారత్ ఓటమి పాలైంది. 32 పరుగుల తేడాతో శ్రీలంక గెలిచింది. శ్రీలంక ఇచ్చిన 241 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించలేకపోయింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 64, శుభ్‌మన్ గిల్ 35, విరాట్ కోహ్లీ 14, శివం దూబె 0, అక్షర్ పటేల్ 44, శ్రేయాస్ అయ్యర్ 7, కేఎల్ రాహుల్ 0, వాషింగ్టన్ సుందర్ 15, కుల్దీప్ యాదవ్ 7 (నాటౌట్), సిరాజ్ 4, అర్ష్ దీప్ 3 పరుగులు చేశారు. 42.2 ఓవర్లకు భారత్ 208 పరుగులకే ఆలౌట్ అయింది. శ్రీలంక బౌలర్లలో జెఫ్రీ వాండర్సే 6, అసలంక 3 వికెట్లు పడగొట్టారు.

భారత్ లక్ష్యం 241 పరుగులు
భారత్ ముందు శ్రీలంక 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిస్సాంక డకౌట్ కాగా, ఫెర్నాండో 40, మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనజె 12, దునిత్ 39, మెండిస్ 40, ధనంజయ 15, జఫ్రె 1 పరుగు చేశారు. దీంతో శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 240-9 స్కోరు చేసింది. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, కుల్దీప్ యాదవ్ 2, సిరాజ్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు.

6 వికెట్లు డౌన్
శ్రీలంక వరుసగా వికెట్లు కోల్పోతోంది. నిస్సాంక డకౌట్ అయిన తర్వాత, ఫెర్నాండో 40, మెండిస్ 30, సమరవిక్రమ 14, అసలంక 25, లియనజె 12 ఔటయ్యారు. 40 ఓవర్ల నాటికి శ్రీలంక స్కోరు 157/6గా ఉంది.

India Vs Sri Lanka 2024: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఇవాళ కొలంబోలో టీమిండియా, శ్రీలంక మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన శ్రీలంక జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి మ్యాచ్‌ డ్రాగా ముగిసిన విషయం విదితమే. క్రీజులోకి వచ్చిందే ఆలస్యం శ్రీలంక ఓపెనర్ నిస్సాంక ఔటయ్యాడు. సిరాజ్ బౌలింగ్ లో కేఎల్ రాహుల్ కి క్యాచ్ ఇచ్చుకున్నాడు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్, కేఎల్ రాహుల్, శివం దూబె, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్‌, సిరాజ్, అర్ష్‌దీప్‌ సింగ్

శ్రీలంక జట్టు: నిస్సాంక, ఫెర్నాండో, కుశాల్ మెండిస్, సదీరా సమరవిక్రమ, చరిత్ అసలంక (కెప్టెన్), కమిందు మెండిస్, జనిత్, దునిత్ వెల్లలాగె, అకిల ధనంజయ, అసిత్ ఫెర్నాండో, జెఫ్రీ వెండర్సె

Paris Olympics 2024 : బంపర్ ఆఫర్.. నీరజ్ చోప్రా స్వర్ణం గెలిస్తే అందరికీ ఉచిత వీసా.. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లొచ్చు