India Vs West Indies : వెస్టిండీస్‌తో వన్డేలు.. విరాట్ కోహ్లీ సంచలనం సృష్టిస్తాడా?.. అరుదైన అవకాశం..! అందరికళ్లు వారిపైనే..
India Vs West Indies : కోహ్లీ ముందు అరుదైన రికార్డులను అధిగమించే చాన్స్ ఉంది. వెస్టిండీస్ జట్టుతో మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లీ ఏకంగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న నాలుగు కీలక రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.
Virat Kohli-Sachin Tendulkar
India Vs West Indies : భారత్ వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా ఆదివారం తొలి వన్డే ప్రారంభం కానుంది. తిరువనంతపురంలో మధ్యాహ్నం 2గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో అందరి కళ్లు స్టార్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ కోహ్లీపైనే ఉన్నాయి. అయితే, కోహ్లీ ముందు అరుదైన రికార్డులను అధిగమించే చాన్స్ ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లీ ఏకంగా సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న నాలుగు కీలక రికార్డులను అధిగమించే అవకాశం ఉంది.
విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 314 వన్డేల్లో 302 ఇన్నింగ్స్‌లు ఆడి 14,941 పరుగులు చేశాడు. 15,000 వన్డే పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతడికి మరో 59 పరుగులు మాత్రమే కావాలి. ఈ మార్క్‌ను చేరుకుంటే, సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన వేగవంతమైన 15 వేల వన్డే పరుగుల రికార్డును కోహ్లీ అధిగమించనున్నాడు.
లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక సెంచరీల రికార్డు ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది. సచిన్ 60 లిస్ట్-ఏ సెంచరీలు సాధించాడు. కోహ్లీ ప్రస్తుతం 58 సెంచరీలతో ఉన్నాడు. వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో మరో రెండు సెంచరీలు చేస్తే ఈ రికార్డును కూడా అధిగమించే అవకాశం ఉంటుంది. అదేవిధంగా భారత్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగానూ సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు. స్వదేశంలో సచిన్ సెంచరీలు 42కాగా.. కోహ్లీ ఖాతాలో 41 సెంచరీలు ఉన్నాయి. వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ లలో కోహ్లీ రెండు సెంచరీలు చేస్తే సచిన్ రికార్డును అధిగమించగలడు.
స్వదేశంలో అత్యధిక వన్డే పరుగుల రికార్డు కూడా సచిన్ పేరిట ఉంది. సచిన్ భారత్‌లో 6,976 వన్డే పరుగులు సాధించాడు. కోహ్లీ 6,867 పరుగులతో ఉన్నాడు. దీంతో ఈ రికార్డును అధిగమించేందుకు కోహ్లీకి 110 పరుగులు అవసరం.
ఇక వెస్టిండీస్‌పై కూడా కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. ఆ జట్టుపై ఇప్పటివరకు 43 మ్యాచ్‌ల్లో 41 ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ 2,261 పరుగులు, 9 సెంచరీలు, 11 అర్ధసెంచరీలు సాధించాడు. మరో రెండు సెంచరీలు చేస్తే వెస్టిండీస్‌పై అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాటర్‌గా కూడా నిలిచే అవకాశం ఉంది.
భారత్-వెస్టిండీస్ తొలి వన్డే ఇవాళ తిరువనంతపురంలో జరగనుండగా.. రెండో వన్డే సెప్టెంబర్ 30న గువాహటిలో, మూడో వన్డే అక్టోబర్ 3న న్యూ చండీగఢ్‌లో జరగనున్నాయి.
