IND vs ZIM : మూడో టీ20లో ఘన విజయం..
ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు హరారే వేదికగా మూడో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి.

IND vs ZIM
టీమ్ఇండియా విజయం..
మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 159 పరుగులకే పరిమితమైంది. జింబాబ్వే బ్యాటర్లలో డియోన్ మైయర్స్ (65) హాఫ్ సెంచరీతో రాణించాడు. క్లైవ్ మదాండే (37) ఫర్వాలేదనిపించాడు. మిగిలిన వారు విఫలం అయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు తీశాడు. ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు సాధించాడు. ఖలీల్ అహ్మద్ ఓ వికెట్ పడగొట్టాడు.
? to ? wins in Harare ?
A 23-run victory in the 3rd T20I as #TeamIndia now lead the series 2⃣-1⃣ ??
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/ZXUBq414bI
— BCCI (@BCCI) July 10, 2024
ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన సుందర్..
భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే జట్టు వరుసగా వికెట్లు కోల్పోతుంది. వాషింగ్టన్ సుందర్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. ఏడో ఓవర్‌లో రెండో బంతికి కెప్టెన్ సికిందర్ రజా(15), ఆఖరి బంతికి జోనాథన్ కాంప్‌బెల్ (1)లను ఔట్ చేశాడు. దీంతో జింబాబ్వే 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.
బ్రియాన్ బెన్నెట్ ఔట్..
భారత బౌలర్ల ధాటికి జింబాబ్వే వరుసగా వికెట్లు కోల్పోతుంది. ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌లో రవిబిష్ణోయ్ క్యాచ్ అందుకోవడంతో బ్రియాన్ బెన్నెట్ (4) ఔట్ అయ్యాడు. దీంతో జింబాబ్వే 3.1 ఓవర్‌లో 19 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లకు జింబాబ్వే స్కోరు 30/3. సికిందర్ రజా (10), డియోన్ మైయర్స్ (0) లు ఆడుతున్నారు.
Early success with the ball for #TeamIndia! ? ?
Two wickets for Avesh Khan & a wicket for Khaleel Ahmed ? ?
Follow the Match ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/wN38Rv6qk8
— BCCI (@BCCI) July 10, 2024
మారుమణి ఔట్..
జింబాబ్వే మరో వికెట్ కోల్పోయింది. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో శివమ్ దూబె క్యాచ్ అందుకోవడంతో తడివానాషే మారుమణి (13) ఔట్ అయ్యాడు. దీంతో జింబాబ్వే 2.4వ ఓవర్‌లో 19 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
వెస్లీ మాధేవెరే ఔట్..
లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన జింబాబ్వేకు ఆదిలోనే షాక్ తగిలింది. ముకేశ్ కుమార్ బౌలింగ్‌లో అభిషేక్ శర్మ క్యాచ్ అందుకోవడంతో వెస్లీ మాధేవెరే(1) ఔట్ అయ్యాడు. దీంతో 1.1వ ఓవర్‌లో 9 పరుగుల వద్ద జింబాబ్వే తొలి వికెట్ కోల్పోయింది.
జింబాబ్వే ముందు భారీ టార్గెట్.. 183
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (66; 49 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదగా, రుతురాజ్ గైక్వాడ్ (49; 28 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో అర్థశతకాన్ని కోల్పోయాడు. యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. జింబాబ్వే బౌలర్లలో ముజారబానీ, సికిందర్ రజాలు చెరో రెండు వికెట్లు తీశారు.
Innings Break!
Captain @ShubmanGill top-scores with 66(49) as #TeamIndia post 182/4 in the first innings ?
Over to our bowlers ?
Scorecard ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/6q46FzzkgP
— BCCI (@BCCI) July 10, 2024
శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ..
టీమ్ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టెండై చతారా బౌలింగ్‌లో ఫోర్ కొట్టి 36 బంతుల్లో అర్ధశతకాన్ని అందుకున్నాడు. 14 ఓవర్లకు భారత స్కోరు 118/2. గిల్ (52), రుతురాజ్ గైక్వాడ్ (19)లు ఆడుతున్నారు.
1⃣0⃣0⃣ up for #TeamIndia! ? ?
5⃣0⃣ up for captain Shubman Gill – his 2nd in T20Is ? ?
Follow the Match ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/4g0BllPGFC
— BCCI (@BCCI) July 10, 2024
అభిషేక్ శర్మ ఔట్..
టీమ్ఇండియా మరో వికెట్ కోల్పోయింది. సికిందర్ రజా బౌలింగ్‌లో మారుమణి క్యాచ్ అందుకోవడంతో రెండో టీ20 మ్యాచ్ సెంచరీ హీరో అభిషేక్ శర్మ(10) ఔట్ అయ్యాడు. దీంతో భారత్ 10.3వ ఓవర్‌లో 81 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
యశస్వి జైస్వాల్ ఔట్..
టీమ్ఇండియాకు తొలి షాక్ తగిలింది. దూకుడుగా ఆడుతున్న యశస్వి జైస్వాల్ (36; 27 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సికిందర్ రజా బౌలింగ్‌లో బ్రియాన్ బెన్నెట్ క్యాచ్ పట్టుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 8.1వ ఓవర్‌లో 67 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది.
6 ఓవర్లకు భారత స్కోరు 55/0
టీమ్ఇండియా ఓపెనర్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ లు జింబాబ్వే బౌలర్లను ఉతికి ఆరేస్తున్నారు. పోటాపోటీగా బౌండరీలు బాదుతున్నారు. ఫలితంగా పవర్ ప్లే ముగిసే సరికి టీమ్ స్కోరు హాఫ్ సెంచరీ దాటింది. 6 ఓవర్లకు భారత స్కోరు 55/0. గిల్ (27), జైస్వాల్ (27)లు క్రీజులో ఉన్నారు.
Off in a flash ⚡️
A quickfire start for #TeamIndia, courtesy captain Shubman Gill & Yashasvi Jaiswal ?
India 55/0 at the End of Powerplay!
Follow the Match ▶️ https://t.co/FiBMpdYQbc#ZIMvIND pic.twitter.com/Qpbz3rM6Pn
— BCCI (@BCCI) July 10, 2024
జింబాబ్వే తుది జట్టు..
తడివానాషే మారుమణి, వెస్లీ మాధేవెరే, బ్రియాన్ బెన్నెట్, డియోన్ మైయర్స్, సికందర్ రజా(కెప్టెన్), జోనాథన్ కాంప్‌బెల్, క్లైవ్ మదాండే(వికెట్ కీపర్), వెల్లింగ్టన్ మసకద్జా, రిచర్డ్ నగరవ, బ్లెస్సింగ్ ముజరబానీ, టెండై చతారా
టీమ్ఇండియా తుది జట్టు..
యశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, శుభమన్ గిల్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్(వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ఖలీల్ అహ్మద్
#TeamIndia win the toss and will bat first ?
Sanju Samson, Yashasvi Jaiswal and Shivam Dube make the Playing XI ?
Follow the Match ▶️ https://t.co/FiBMpdZo0K#ZIMvIND pic.twitter.com/4b6jBqx899
— BCCI (@BCCI) July 10, 2024
India vs Zimbabwe : ఐదు టీ20 మ్యాచుల సిరీస్‌లో భాగంగా భారత్, జింబాబ్వే జట్లు హరారే వేదికగా మూడో టీ20 మ్యాచులో తలపడుతున్నాయి. తొలి టీ20 మ్యాచ్‌లో జింబాబ్వే, రెండో టీ20 మ్యాచ్‌లో భారత్ విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో గెలుపొంది సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకువెళ్లాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలో టీమ్ఇండియా టాస్ గెలిచింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కాగా.. టీ20 ప్రపంచకప్‌లో భాగమై జట్టులో ఆలస్యంగా చేరిన సంజూశాంసన్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలకు తుది జట్టులో చోటు దక్కింది.