IND-w vs IRE-w : వ‌న్డే సిరీస్‌లో భార‌త మ‌హిళల‌ జ‌ట్టు శుభారంభం.. ఐర్లాండ్ పై తొలి వ‌న్డేలో ఘ‌న‌ విజ‌యం

మూడు వ‌న్డేల మ్యాచుల సిరీస్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు శుభారంభం చేసింది.

India Women won by 6 wickets in 1st ODI against Ireland Women

మూడు వ‌న్డేల మ్యాచుల సిరీస్‌లో భార‌త మ‌హిళల జ‌ట్టు శుభారంభం చేసింది. ఐర్లాండ్‌తో రాజ్‌కోట్‌లోని నిరంజ‌న్ షా స్టేడియంలో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త్ 6 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. ఐర్లాండ్ జ‌ట్టు నిర్దేశించిన 239 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 34.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

భార‌త బ్యాట‌ర్ల‌లో ప్రతీకా రావల్ (89; 96 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌), తేజల్ హసబ్నిస్ (53 నాటౌట్; 46 బంతుల్లో 9 ఫోర్లు) హాఫ్ సెంచ‌రీలు చేశారు. కెప్టెన్ స్మృతి మంధాన (41; 29 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడింది. హ‌ర్మ‌న్ డియోల్ (20) రాణించింది. ఐర్లాండ్ బౌల‌ర్ల‌లో ఐమీ మాగైర్ మూడు వికెట్లు తీసింది.

Virat Kohli : ఆస్ట్రేలియా నుంచి రాగానే భార్యా, పిల్ల‌ల‌తో క‌లిసి కోహ్లీ ఎక్క‌డికి వెళ్లారో చూశారా ?

అంత‌క‌ముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 238 ప‌రుగులు చేసింది. ఐరీష్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ గాబీ లూయిస్ (92; 129బంతుల్లో 15 ఫోర్లు) తృటిలో శ‌త‌కాన్ని చేజార్చుకుంది. లేహ్ పాల్ (59; 73 బంతుల్లో 7 ఫోర్లు) రాణించింది. భార‌త బౌల‌ర్ల‌లో ప్రియా మిశ్రా రెండు వికెట్లు తీసింది. దీప్తి శ‌ర్మ‌, టిటాస్ సాధు, సయాలీ సత్ఘరే లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

ఈ విజ‌యంతో మూడు వ‌న్డేల సిరీస్‌లో భార‌త్ 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఇరు జ‌ట్ల మ‌ధ్య రెండో వ‌న్డే ఆదివారం ఇదే వేదిక‌పైన జ‌ర‌గ‌నుంది.

KL Rahul : ఇంగ్లాండ్‌తో టీ20, వ‌న్డే సిరీస్‌ల‌కు కేఎల్ రాహుల్ దూరం..!