IND vs ENG : వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన భార‌త్.. మూడో వ‌న్డేలో ఇంగ్లాండ్ పై ఘ‌న విజ‌యం

ఇంగ్లాండ్‌తో టీ20 సిరీస్‌ను 4-1తో కైవ‌సం చేసుకున్న భార‌త్ వ‌న్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

India won by 142 runs in 3rd ODI against and clean sweep the series

ఇంగ్లాండ్‌తో మూడు వ‌న్డేల సిరీస్ ను భార‌త్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. అహ్మ‌దాబాద్ వేదిక‌గా జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త్ 142 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యాన్ని సాధించింది. 357 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 34.2 ఓవ‌ర్ల‌లో 214 ప‌రుగుల‌కు ఆలౌటైంది.

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో టామ్ బాంట‌న్ (38), బెన్ డ‌కెట్ (34) లు రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్‌, హ‌ర్షిత్ రాణా, అక్ష‌ర్ ప‌టేల్‌, హార్దిక్ పాండ్యా త‌లా రెండు వికెట్లు తీశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్‌, కుల్దీప్ యాద‌వ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

IND vs ENG : ’50’లో 100.. అహ్మ‌దాబాద్ వ‌న్డేలో శుభ్‌మ‌న్ గిల్ రికార్డులు ఇవే..

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ కు ఓపెన‌ర్లు బెన్‌డ‌కెట్, ఫిలిప్ సాల్ట్ (23) శుభారంభం అందించారు. డ‌కెట్ భార‌త బౌల‌ర్ల‌పై ఎదురుదాడికి దిగాడు. ఎడాపెడా ఫోర్ల‌తో స్కోరు బోర్డును ప‌రుగులు పెట్టించాడు. వీరిద్ద‌రు తొలి వికెట్‌కు కేవ‌లం 6.2 ఓవ‌ర్ల‌లో 60 ప‌రుగులు జోడించారు. ప్ర‌మాదకరంగా మారిన ఈ జోడిని డ‌కెట్‌ను ఔట్ చేయ‌డం ద్వారా అర్ష్‌దీప్ సింగ్ విడ‌గొట్టాడు.

సాల్ట్‌, టామ్ బాండ‌న్‌, జోరూట్‌(24), హ్యారీ బ్రూక్ (19)లకు మంచి ప్రారంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌లేక‌పోయారు. అటు కెప్టెన్ జోస్ బ‌ట్ల‌ర్ (6)తో పాటు స్టార్ ఆల్‌రౌండ‌ర్ లియామ్ లివింగ్ స్టోన్ (9)లు సైతం విఫ‌లం కావ‌డంతో ఏ ద‌శ‌లోనూ ఇంగ్లాండ్ ల‌క్ష్యం దిశ‌గా సాగ‌లేదు. దీంతో భార‌త్ భారీ తేడాతో గెలుపొందింది.

Virat Kohli- Adil Rashid : వార్నీ కోహ్లీ వికెట్ తీయ‌డం అంటే ఇంత‌ ఇష్ట‌మా ఆదిల్ ర‌షీద్ నీకు.. అత్య‌ధిక సార్లు ఔట్ చేసిన బౌల‌ర్‌గా..

అంత‌క ముందు భార‌త్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 356 ప‌రుగులకు ఆలౌటైంది. భార‌త బ్యాట‌ర్ల‌లో శుభ్‌మ‌న్ గిల్ (112; 102 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) శ‌త‌కంతో చెల‌రేగాడు. బ్యాట‌ర్ల‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ (78; 64 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స‌ర్లు), విరాట్ కోహ్లీ (52; 55 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్ సెంచ‌రీలు చేశారు.

కేఎల్ రాహుల్ (40; 29 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ప‌రుగులు రాబ‌ట్టారు. ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌లో ఆదిల్ రషీద్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. మార్క్ వుడ్ రెండు వికెట్లు తీశాడు. సాకిబ్ మ‌హ‌మూద్‌, గుస్ అట్కిన్సన్, జో రూట్ లు త‌లా ఓ వికెట్ సాధించారు.

ప‌రుగుల ప‌రంగా ఇంగ్లాండ్ పై భార‌త్‌కు అతి పెద్ద విజ‌యాలు ఇవే..
* 2018లో రాజ్‌కోట్‌లో 158 ప‌రుగులు
* 2025లో అహ్మ‌దాబాద్‌లో 142 ప‌రుగులు
* 2014లో కార్డిఫ్‌లో 133 ప‌రుగులు
* 20213లో కొచ్చిలో 127 ప‌రుగులు
* 2011లో హైద‌రాబాద్‌లో 126 ప‌రుగులు