KL Rahul and Harshit Rana (Image Credit To Original Source)
India vs New Zealand: న్యూజిలాండ్‌తో వడోదరలోని బీసీఏ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది.
భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ 26, శుభ్‌మన్ గిల్ 56, విరాట్ కోహ్లీ 93, శ్రేయస్ అయ్యర్ 49, రవీంద్ర జడేజా 4, కేఎల్ రాహుల్ 29 (నాటౌట్), హర్షిత్ రాణా 29, వాషింగ్టన్ సుందర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు. దీంతో ఇండియా స్కోరు 49 ఓవర్లలో 306-6గా నమోదైంది.
న్యూజిలాండ్ బౌలర్లలో కైల్ జేమిసన్ 4 వికెట్లు, అదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ ఒక్కో వికెట్ పడగొట్టారు.
అంతకు ముందు, న్యూజిలాండ్ బ్యాటర్లలో డెవన్ కాన్వే 56, హెన్రీ నికోల్స్ 62, విల్ యంగ్ 12, డారిల్ మిచెల్ 84, గ్లెన్ ఫిలిప్స్ 12, మిచెల్ హే 18, మైఖేల్ బ్రేస్‌వెల్ 16, జాకరీ ఫౌల్క్స్ 1, క్రిస్టియన్ క్లార్క్ 24 (నాటౌట్), కైల్ జేమిసన్ 8 (నాటౌట్) రన్స్ చేశారు.
టీమిండియా బౌలర్లలో సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ రెండేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.