Dipa Karmakar : దీపా క‌ర్మాక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. జిమ్నాస్టిక్స్‌కు వీడ్కోలు

భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది.

Indian gymnast Dipa Karmakar announces retirement

Dipa Karmakar Retires : భార‌త స్టార్ జిమ్నాస్ట్ దీపా క‌ర్మాక‌ర్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. ఆట‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్లు ప్ర‌కటించింది. ఎంతో ఆలోచించిన త‌రువాతే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా తెలియ‌జేసింది. రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్న‌ట్లు తెలిపింది.

భార‌త జిమ్నాస్టిక్స్ పై చెద‌ర‌ని ముద్ర వేసింది దీపా క‌ర్మాక‌ర్‌. ఒలింపిక్స్‌లో జిమ్నాస్టిక్స్‌లో పోటీప‌డ్డ తొలి భార‌త మ‌హిళ‌గా రికార్డు సృష్టించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో తృటిలో ప‌త‌కాన్ని కోల్పోయింది. 0.15 పాయింట్ల తేడాతో కాంస్య ప‌త‌కాన్ని చేజార్చుకుని నాలుగో స్థానంలో నిలిచింది.

ENG vs PAK 1st Test: అయ్యో బాబర్‌ అజామ్‌.. నీ ఆట మేము చూడలేము స్వామి.. 16 ఇన్సింగ్స్ లో ఎన్ని పరుగులు చేశాడో తెలుసా?

2011 నేషనల్ గేమ్స్‌లో నాలుగు ఈవెంట్లలో స్వర్ణ పతకాలు సాధించింది. 2014 ఆసియా ఛాంపియన్‌షిప్‌లో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది.

‘ఎంతో ఆలోచించాక జిమ్నాస్టిక్స్ నుంచి రిటైర్‌కావాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఇది అంత తేలిక‌గా తీసుకున్న నిర్ణయం కాదు. వీడ్కోలు ప‌ల‌క‌డానికి ఇదే స‌రైన స‌మ‌యం అని భావిస్తున్నాను. నా జీవితంలో జిమ్నాస్టిక్స్ ఎంతో ముఖ్య భాగం. జిమ్నాస్ట్‌గా సాధించిన ఘనతలకు గర్విస్తున్నాను. ప్రపంచ వేదికపై భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం, పతకాలు గెలవడం, ముఖ్యంగా రియో ఒలింపిక్స్‌లో ప్రొడునోవా వాల్ట్‌ తీపి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి’ .అని దీపా కర్మాకర్ తెలిపింది. ఇక భవిష్యత్తులో కోచ్‌ కావాలనుకుంటున్నట్లు చెప్పింది.

IND vs BAN : ఇది భార‌త జ‌ట్టు కాదు.. ఐపీఎల్ జ‌ట్టు : పాక్‌ మాజీ క్రికెటర్‌