IND vs BAN : ఇది భారత జట్టు కాదు.. ఐపీఎల్ జట్టు : పాక్ మాజీ క్రికెటర్
పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి భారత్‌లో అడుగుపెట్టింది బంగ్లాదేశ్.

Yeh Indian Team Nahi IPL XI says Basit Ali
IND vs BAN : పాకిస్థాన్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి భారత్‌లో అడుగుపెట్టింది బంగ్లాదేశ్. అయితే.. భారత్‌లో కథ అడ్డం తిరిగింది. విజయం సంగతి అటుంచితే కనీస పోరాట పటిమ కూడా బంగ్లాదేశ్ నుంచి కొరవడింది. గ్వాలియర్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ ఓడిపోయింది. ఈ క్రమంలో ఆ జట్టు పై విమర్శల జడివాన మొదలైంది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్ అభిమానులు, మాజీ క్రికెటర్లు.
టీమ్ఇండియాకు కనీస ఓటీ ఇవ్వలేకపోయిన బంగ్లాదేశ్ జట్టుపై టెస్టు సిరీస్ ఓడిపోయిన పాకిస్థాన్‌ను ఏమనాలో కూడా తనకు అర్థం కావడం లేదని పాక్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ అన్నాడు. రెండో మ్యాచులోనూ టీమ్ఇండియా గెలిస్తే.. ఆఖరి టీ20 మ్యాచ్‌లో బెంచీపై ఉన్న ఆటగాళ్లతో ఆడి కూడా భారత్ గెలుస్తుందని పేర్కొన్నాడు.
అదే సమయంలో బంగ్లాదేశ్ పై మండిపడ్డాడు. పాకిస్థాన్‌ను వైట్ వాష్ చేసిన జట్టు ఇదేనా అని ప్రశ్నించాడు. ఇది భారత జట్టు కాదని, ఐపిఎల్ స్టార్లతో కూడిన జట్టు అని అలీ ప్రశంసల వర్షం కురిపించాడు. యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ ఆటగాళ్లు లేరు అయినా భారత్ ఎంతో బలంగా ఉంది. ఈ టీమ్‌కు కూడా బంగ్లా ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. అని అలీ అన్నారు.