Indian Hockey
Hockey Star PR Sreejesh : జర్మనీ-భారత్ మధ్య కాంస్య పతకం కోసం పోరు హోరాహోరిగా సాగుతోంది. నువ్వా నేన్నా అన్నట్లు ఇరు జట్లు తలపడుతున్నాయి. 41ఏళ్ల నీరిక్షణ తెరదించాలన్న ఇండియన్ మెన్స్ టీమ్ ఒకవైపు.. ఎలాగైనా బ్రాంజ్ మెడల్ కొట్టాలన్న కసితో జర్మనీ వైపు. 4వ క్వార్టర్స్ ముగింపు దశకు చేరుకుంది. ఇండియా అప్పటికే 5-4 తేడాతో జర్మనీపై లీడ్‌లో ఉంది. ఇంకా 6 సెకండ్ల్ టైమ్ మాత్రమే మిగిలి ఉంది. అప్పుడే జర్మనీకి వచ్చింది లక్కీ ఛాన్స్. పెనాల్టీ కార్నర్‌ను జర్మనీ దక్కించుకుంది. ఇక టీమిండియాతో పాటు మ్యాచ్ చూస్తున్న భారత్ అభిమానులకు ఒకటే టెన్షన్. అందరీ చూపు ఒకడివైపే. అతడే భారత్ జట్టు గోల్ కీపర్ శ్రీజిష్.
Read More : Rainbow Python Video : రెయిన్‌బో పైధాన్.. ఈ వీడియోను రెండు కోట్లమందికి పైగా వీక్షించారు
జాతీయ జట్టుకు ఆడాలన్న కల :-
1998లో 12ఏళ్ల వయసులో జాతీయ జట్టుకు ఆడాలన్న కలతో కోచింగ్ జాయిన్ అయిన శ్రీజిష్‌కు తల్లిదండ్రులిచ్చిన ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. కోచింగ్ ఫీజ్ కోసం తన తండ్రి ఏకంగా ఆవును అమ్ముకున్నారు. 2004లో జూనియర్ నేషనల్ టీమ్‌కు ఆడిన శ్రీజిష్.. రెండేళ్లకే సీనియర్ నేషనల్ టీమ్‌లో చోటు సంపాదించాడు. 2014 ఆసియా గేమ్స్‌లో ఇండియా గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. 2015లో జరిగిన హాకీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియా మూడో స్థానంలో నిలవగా.. శ్రీజిష్‌కు మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ లభించింది. 2017లో గాయం కారణంగా జట్టుకు దూరమైన శ్రీజిష్.. 2018లో కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు.
Read More :Hockey Bronze : గోల్ పోస్ట్ ఎక్కిన శ్రీజిష్., ఫొటో వైరల్
శ్రీజిష్ ప్రతిభ అసాధారణం :-
ఒలింపిక్స్‌లో భారత్ పురుషుల హాకీ జట్టు ఆడిన తొలి మ్యాచ్ నుంచి బ్రాంజ్ మెడల్ మ్యాచ్ వరకు శ్రీజిష్ చూపిన ప్రతిభ అసాధారణం. ఆస్ట్రేలియా, అర్జెంటీనా, న్యూజిలాండ్, స్పెయిన్, జపాన్‌లపై మ్యాచ్‌ల్లో అతడు గోల్ పోస్ట్‌కు గోడలా నిలబడ్డాడు. కేరళకు చెందిన శ్రీజిష్ జట్టులో ఎన్నో ఏళ్లుగా కీలక ఆటగాడు. భారత జట్టుకు గతంలో నాయకత్వం కూడా వహించాడు. తన అద్భుత కీపింగ్‌తో యువ హాకీ క్రీడాకారులను కూడా తీర్చిదిద్దిన ఘనత అతని సొంతం.