×
Ad

Smriti Mandhana : టీ20 క్రికెట్లో చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. తొలి ఇండియన్ బ్యాటర్‌గా రికార్డు!

Smriti Mandhana : భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది. విశాఖపట్టణం వేదికగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ ..

Smriti Mandhana

Smriti Mandhana : భారత మహిళల జట్టు అదరగొట్టింది. వన్డే ప్రపంచ కప్ విజయం సాధించిన నెల రోజుల విరామం తరువాత మైదానంలోకి అడుగుపెట్టి భారత మహిళా క్రికెటర్లు మరోసారి అద్భుత ప్రదర్శన చేశారు. ఈ క్రమంలో భారత మహిళా జట్టు స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన సరికొత్త చరిత్ర సృష్టించింది.

Also Read : AP Govt : ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..

శ్రీలంకతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా విశాఖపట్టణం వేదికగా ఆదివారం తొలి టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత ప్లేయర్లు బౌలింగ్, బ్యాటింగ్‌లోనూ అదరగొట్టారు. ఫలితంగా స్వల్ప లక్ష్యాన్ని మరో 32 బంతులు మిగిలి ఉండగానే ఛేధించి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించారు. తద్వారా సిరీస్‌లో బోణీ కొట్టారు.

విశాఖపట్టణం వేదికగా జరిగిన మ్యాచ్‌లో తొలుత శ్రీలంక బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టుకు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన షఫాలీ వర్మ (9) మరుసటి ఓవర్‌లో ఔట్ అయింది. ఆ తరువాత స్మృతి మంధాన, జెమీమా ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ క్రమంలో స్మృతి మంధాన చరిత్ర సృష్టించింది.


టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన మహిళల టీ20 క్రికెట్లో 4వేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అదే సమయంలో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్లో రెండో బ్యాటర్ గా నిలిచింది. స్మృతి కంటే ముందు న్యూజిలాండ్ బ్యాటర్ సుజీ బేట్స్ ఈ ఘనత సాధించారు. సుజీ బేట్స్ ఇప్పటి వరకు 177 మ్యాచ్‌లలో 4,716 పరుగులు చేసింది. ప్రస్తుతం స్మృతి మంధాన 154 మ్యాచ్‌లలో 4007 పరుగులు చేసింది. ఇక మూడో స్థానంలో హర్మన్‌ప్రీత్ కౌర్ ఉంది. ఆమె 183 మ్యాచ్‌లలో 3,669 పరుగులు చేసింది.