AP Govt : ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..

AP Govt Whatsapp Services : ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మరికొన్ని సేవలు..

AP Govt : ఏపీ ప్రజలకు మరో శుభవార్త.. ఆ సేవలన్నీ ఇకపై ఉచితంగా.. వెంటనే ఇలా చేయండి..

AP Govt Whatsapp Services

Updated On : December 22, 2025 / 7:40 AM IST

AP Govt Whatsapp Services : ఏపీలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పలు పనుల కోసం, పలు రకాల సర్టిఫికెట్ల కోసం ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగకుండా.. ఇంటి నుంచే సేవలు పొందేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పలు రకాల సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. తాగాజా.. మరికొన్ని సేవలు అందుబాటులోకి వచ్చాయి. మొత్తానికి సంక్రాంతి పండుగ నాటికి దాదాపు అన్ని సేవలు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.

Also Read : AP TDP : ఏపీలో టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల జాబితా విడుదల

మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా తాజాగా పోలీసులకు సంబంధించిన సేవల్ని కూడా కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎఫ్ఐఆర్ నుంచి వాహనాలపై ఉన్న ట్రాఫిక్ చలానాల వరకు అన్నివివరాలు వాట్సాప్ ద్వారానే తెలుసుకునేలా వీలు కల్పించారు. తద్వారా వెంటనే ఆ చలానాలను ఆన్‌లైన్లోనే చెల్లించొచ్చు.

ఇలా చేయాలి..
♦  పోలీసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, ట్రాఫిక్ చలాన్ల వివరాలను వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు.
♦  వాట్సాప్ సేవల కోసం 95523 00009 నంబరును మొబైల్లో సేవ్ చేసుకోవాలి.
♦  ఆ నెంబర్‌కు వాట్సాప్‌లో ‘బీఖి’ అని మెసేజ్ పంపాలి. అప్పుడు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అనే ఆప్షన్ వస్తుంది.
♦  ఈ సేవను తెలుగులో పొందాలనుకుంటే ‘టీఈ’ అని టైప్ చేయాలి. ఆ తరువాత సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
♦  ఆ తరువాత పోలీస్ శాఖ సేవలను ఎంచుకోవాలి. అందులో ఎఫ్ఐఆర్, ఎఫ్ఐఆర్ స్థితి, ఈ-చలాన్ అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి.
♦  ఈ-చలాన్ వివరాలను ఎంచుకొని, మీ వాహనం నెంబర్ ను నమోదు చేసి క్లిక్ చేయాలి. మీ వాహనం రిజిస్ట్రేషన్ నంబరుపై ఉన్న ఈ-చలాన్ల వివరాలు కనిపిస్తాయి.
♦  ఈ-చలాన్లను ఆన్‌లైన్లోనే బ్యాంకు కార్డు ద్వారా చెల్లించొచ్చు.
♦  చెల్లింపు పూర్తయిన తరువాత రశీదు కూడా వస్తుంది.
♦  ఒకవేళ మీ వాహనంపై ఎటువంటి చలాన్లు లేకపోతే ‘నో చలానాస్ ఫౌండ్’ అని మెసేజ్ వస్తుంది.
♦  ఈ సేవ ద్వారా వాహనదారులు తమ చలాన్లను సులభంగా తెలుసుకొని చెల్లించే అవకాశం లభిస్తుంది.
♦  రాష్ట్ర ప్రజలు మన మిత్ర వాట్సాప్ ద్వారా పోలీసులకు సంబంధించి సేవల్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.