Wriddhiman Saha Retire : క్రికెట్ కు వృద్ధిమాన్ సాహా గుడ్ బై..

భారత్ తరఫున 40 టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు. తన కెరీర్‌లో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ముగించాడు. జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టాడు.

Wriddhiman Saha Retire (Photo Credit : Twitter)

Wriddhiman Saha Retire : భారత వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ వృద్ధిమాన్ సాహా క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్ మెంట్ ప్రకటించాడు. వృద్ధిమాన్ సాహా రంజీ ట్రోఫీలో పంజాబ్‌తో తన చివరి మ్యాచ్ ఆడాడు. ఇందులో డకౌట్ అయ్యాడు. అయితే ఈ మ్యాచ్‌లో బెంగాల్ ఇన్నింగ్స్ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్ సందర్భంగా.. సాహా క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతూ గార్డ్ ఆఫ్ హానర్‌తో సత్కరించారు.

సోషల్ మీడియాలో తన క్రికెట్ ప్రయాణాన్ని ప్రతిబింబిస్తూ క్రీడకు కృతజ్ఞతలు తెలిపాడు. తన కెరీర్‌లో హెచ్చు తగ్గులను గుర్తించి, ముందుకు సాగడానికి ఇది సమయం అని పేర్కొన్నాడు. తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని ఎదురుచూస్తున్నట్లు సాహా తెలిపాడు.

నిరంతరం మద్దతు ఇస్తున్నందుకు.. సాహా తన తల్లిదండ్రులు, సోదరుడు, భార్య (రోమి), పిల్లలు (అన్వీ, అన్వే) అత్తమామలకు కృతజ్ఞతలు తెలిపాడు. భారత జాతీయ జట్టు, బెంగాల్, త్రిపుర, KKR, CSK, పంజాబ్ కింగ్స్, SRH, గుజరాత్ టైటాన్స్ వంటి IPL ఫ్రాంచైజీలతో సహా వివిధ జట్లకు చెందిన తన కోచ్‌లు, మెంటర్లు, సహచరులు, సిబ్బందిని కూడా ప్రశంసించాడు. తన చిన్ననాటి కోచ్ జయంత భౌమిక్‌కి తన సామర్థ్యాన్ని ప్రారంభంలోనే గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు సాహా.

2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన సాహా భారత్ తరఫున 40 టెస్టులు, తొమ్మిది వన్డేలు ఆడాడు. 2014లో ఎంఎస్ ధోని రిటైర్మెంట్ తర్వాత, రిషబ్ పంత్ అతని స్థానంలోకి రాకముందే భారత్ ప్రాధమిక టెస్ట్ వికెట్ కీపర్ అయ్యాడు. చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2021లో న్యూజిలాండ్‌తో ఆడాడు.

IPLలో సాహా అనేక జట్లకు ఆడాడు. 2014 ఫైనల్‌లో చిరస్మరణీయ ప్రదర్శన కనబరిచాడు. పంజాబ్ కోసం 55 బంతుల్లో 115 పరుగులు చేశాడు. రిటైర్మెంట్‌తో, సాహా తన కెరీర్‌లో ఒక అద్భుతమైన అధ్యాయాన్ని ముగించాడు. జీవితంలో కొత్త దశలోకి అడుగు పెట్టాడు.

Also Read : ఎట్ట‌కేల‌కు ఛాంపియ‌న్స్ ట్రోఫీకి జ‌ట్టును ప్ర‌క‌టించిన పాకిస్థాన్.. ఆ ముగ్గురిపై వేటు..

”క్రికెట్ ఫీల్డ్ లోకి అడుగుపెట్టి 28 ఏళ్లు అయ్యింది. 1997లో ఎంట్రీ ఇచ్చాను. నా జర్నీ ఎంతో అద్భుతంగా సాగింది. నా దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు, క్లబ్ లకి, యూనివర్సిటీకి, కాలేజ్ కి, స్కూల్ కి ప్రాతినిధ్యం వహించడం నా జీవితంతో గొప్ప గౌరవం. ఈరోజు జీవితంలో నేను ఇలా ఉండటానికి, నేను సాధించిన దానికి, నేర్చుకున్న పాఠాలు.. ఇదంతా వండర్ ఫుల్ గేమ్ తో సాధ్యమైంది” అని సాహా పేర్కొన్నాడు. ఈ మేరకు థ్యాంక్యూ క్రికెట్, థ్యాంక్యూ ఎవ్రీ వన్ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు సాహా.