Champions Trophy 2025 : ఎట్టకేలకు ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన పాకిస్థాన్.. ఆ ముగ్గరిపై వేటు..
ఎట్టకేలకు పాకిస్థాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే పాక్ జట్టును ప్రకటించింది.

PCB announces Pakistan squad for Champions Trophy 2025
పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. మొత్తం 8 జట్లు కప్పుకోసం పోటీపడనున్నాయి. ఇప్పటికే ఏడు దేశాలు తమ జట్లను ప్రకటించాయి. ఆతిథ్య దేశం పాకిస్థాన్ మాత్రమే జట్టను ప్రకటించకుండా వాయిదాలు వేస్తూ వచ్చింది. ఎట్టకేలకు శుక్రవారం నాడు 15 మంది సభ్యులతో కూడి జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది.
దక్షిణాఫ్రికా పర్యటనలో ఆడిన జట్టులో పలు మార్పులను చేసింది. ఓపెనర్ సయీమ్ ఆయూబ్ గాయంతో దూరం అయ్యాడు. ఇక పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న అబ్దుల్లా షఫీక్, ఇర్ఫాన్, సుఫియాన్ ముఖీమ్‌ల పై వేటు వేశారు. వీరి స్థానాల్లో ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్, ఖుషిదిల్ షా, సౌద్ షకీల్ లు జట్టులోకి వచ్చారు. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ నాయకత్వంలోనే పాకిస్థాన్ బరిలోకి దిగనున్నట్లు సెలక్టర్లు వెల్లడించారు. ఆల్‌రౌండర్ సల్మాన్ అలీని వైస్ కెప్టెన్‌గా నియమించారు.
IND vs ENG : వామ్మో హర్షిత్ రాణా చరిత్ర సృష్టించాడుగా.. ప్రపంచ టీ20 క్రికెట్‌లో ఒకే ఒక్కడు
ICC Champions Trophy 2️⃣0️⃣1️⃣7️⃣ winners announce squad for the 2️⃣0️⃣2️⃣5️⃣ event 🏆✨
How will you show your support for the Pakistan team❓#ChampionsTrophy | #WeHaveWeWill pic.twitter.com/zDYPFuqzBU
— Pakistan Cricket (@TheRealPCB) January 31, 2025
నిలకడగా రాణించిన ఆటగాళ్లకు పెద్ద పీట వేసినట్లు జాతీయ సెలెక్టర్ అసద్ షఫీక్ తెలిపారు. దేశవాళీలో రాణించిన కుర్రాళ్లకు అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. ఇక జట్టులో అబ్రర్ అహ్మద్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. పేసర్ షాహిన్ అఫ్రిది బౌలింగ్ విభాగాన్ని ముందుండి నడిపించనున్నాడు.
2017లో ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా పాకిస్థాన్ నిలిచింది. ఈ క్రమంలో ఆరు సంవత్సరాల జరుగుతున్న ఈ టోర్నీలో మరోసారి విజేతగా నిలవాలని పాకిస్థాన్ ఆరాటపడుతోంది. ఆ టోర్నీలో ఆడిన బాబర్ ఆజాం, ఫహీమ్ అష్రవ్, ఫకార్ జమాన్‌లు తాజా టోర్నీలో బరిలోకి దిగనున్న జట్టులోనూ చోటు దక్కించుకున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు పాకిస్థాన్.. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా దేశాలతో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్‌కు కూడా ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుతోనే పాక్ బరిలోకి దిగనున్నట్లు సెలక్టర్లు చెప్పారు.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ జట్టు ఇదే..
బాబర్ అజామ్, ఫఖర్ జమాన్, కమ్రాన్ గులాం, సౌద్ షకీల్, తయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, ఖుష్దిల్ షా, సల్మాన్ అలీ అఘా (వైస్ కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్ (కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రార్ అహ్మద్, హరీస్ రౌఫ్, మహ్మద్ , నసీమ్ షా, షాహీన్ షా అఫ్రిది.