IND vs ENG : మాకేం తెలియదు.. మ్యాచ్ మధ్యలో హర్షిత్ రాణా ఎంట్రీ పై జోస్ బట్లర్ సంచలన వ్యాఖ్యలు.. సరైందికాదు..
నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ ఫీల్డింగ్ సందర్భంలో శివమ్ దూబె స్థానంలో హర్షిత్ రాణా కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా వచ్చాడు. దీనిపై బట్లర్ మాట్లాడారు.

Jos Buttler comments on Harshit Rana As Concussion Substitute For Shivam Dube in 4th t20 match
మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. శుక్రవారం పూణే వేదికగా జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్ 15 పరగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ తుది జట్టులో చోటు లేకపోయిన అనూహ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో జట్టులోకి వచ్చాడు హర్షిత్ రాణా. తన మ్యాజిక్ బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు. 4 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.
భారత బ్యాటింగ్ సందర్భంగా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్‌లో ఆల్‌రౌండర్ శివమ్ దూబె కంకషన్ కు గురి అయ్యాడు. జేమి ఓవర్టన్ వేసిన ఓ బంతి దూబే తలను బలంగా తాకింది. వెంటనే పిజియోలు వచ్చి అతడిని పరిశీలించారు. తనకు బాగానే ఉందని దూబె చెప్పడంతో వారు వెళ్లిపోయారు. అదే ఓవర్‌లో ఆఖరి బంతికి దూబె రనౌట్ అయ్యాడు. ఆ తరువాత ఫీల్డింగ్ కు రాలేదు. రెండు ఓవర్ల తరువాత అతడి స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్ గా హర్షిత్ రాణా వచ్చాడు.
JOS BUTTLER ON CONCUSSION SUBSTITUTE:
“It’s not a like for like replacement, we don’t agree with it”.pic.twitter.com/QBSIZKJ2BG
— Mufaddal Vohra (@mufaddal_vohra) January 31, 2025
బట్లర్ అసంతృప్తి..
కంకషన్ సబ్ నిర్ణయం పై ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అసంతృప్తిని వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో మైదానంలోనే ఉన్న బట్లర్ ఈ విషయమై ఫీల్డ్ అంపైర్‌తో చర్చించాడు. అయినప్పటికి నిర్ణయం భారత్‌కు అనుకూలంగా వచ్చింది. దీనిపై మ్యాచ్ అనంతరం బట్లర్ స్పందించాడు. ఈ నిర్ణయం సరైంది కాదు. దీనితో తాము ఏకీభవించడం లేదన్నాడు. తమతో కనీసం మాట మాత్రం చెప్పకుండా ఈ రిప్లేస్‌మెంట్ జరిగిందన్నాడు. హర్షిత్ ఎందుకు అని అడిగాను.. కంకషన్ సబ్ అని చెప్పినట్లు బట్లర్ వివరించారు. మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ నిర్ణయం తీసుకున్నారని చెప్పాడు. దీనిపై స్పష్టత ఆయనే ఇవ్వాలన్నాడు.
దీనిపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఇంగ్లాండ్ మాజీ ఆటాళ్లతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. ఆల్‌రౌండర్ స్థానంలో స్పెషలిస్ట్ పేసర్‌ను ఎలా తీసుకుంటారని ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, నిక్ నైట్‌లు ప్రశ్నిస్తున్నారు.
ఐసీసీ నిబంధన ఇదే..
ఐసీసీ రూల్ 1.2.7.3 ప్రకారం.. కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా ఒకరికి బదులు మరొకరిని ఆడించేందుకు అనుమతి ఉంటుంది. అయితే.. బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలర్, ఆల్‌రౌండర్ స్థానంలో ఆల్‌రౌండర్‌ను తీసుకోవచ్చు. ఏదైన జట్టు విజ్ఞప్తి చేస్తే.. అందుకు ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆమోదం తప్పనిసరి. అతడిదే తుది నిర్ణయం. దీనిపై ప్రత్యర్థి జట్టుకు అప్పీలుకు అవకాశం ఉండదు. ఇక నాలుగో టీ20 మ్యాచ్‌లో దూబే ఆల్‌రౌండర్ కాబట్టి అతడి స్దానంలో హర్షిత్ రాణాను ఆల్‌రౌండర్‌గా పరిగణించి మ్యాచ్ రిఫరీ కంకషన్ సబ్‌స్ట్యూట్‌గా అతడిని అనుమతించాడు.