Kl Rahul
KL Rahul : సౌతాఫ్రికాతో జరిగే మూడు వన్డేల సిరీస్ కు భారత జట్టుని బీసీసీఐ ప్రకటించింది. టీమిండియా సీనియర్ జట్టుకి కొత్త కెప్టెన్ వచ్చాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో కేఎల్ రాహుల్ భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఇక వైస్ కెప్టెన్‌గా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంపికయ్యాడు. 18 మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు.
భారత జట్టు:
కేఎల్ రాహుల్ (కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), చాహల్, అశ్విన్, వాషింగ్టన్ సుందర్, బుమ్రా (వైస్ కెప్టెన్), భువనేశ్వర్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్.
Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు కూడా రోహిత్ అందుబాటులో లేడు. అతని స్థానంలో కేఎల్ రాహుల్‌ను టెస్టుల్లో వైస్ కెప్టెన్ గా నియమించారు. గాయం నుంచి కోలుకోవడానికి రోహిత్ చికిత్స పొందుతున్నాడని, ప్రపంచకప్ కోసం రోహిత్ ఫిట్‌గా ఉండటం అవసరం అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Whatsapp 3 Tick : వాట్సాప్‌లో మూడో బ్లూ టిక్.. ఆ వార్త ఫేక్..!
రవిచంద్రన్ అశ్విన్ చాలా కాలం తర్వాత వన్డే జట్టులోకి వచ్చాడు. స్పిన్ విభాగంలో లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్‌లు అతనితో ఉన్నారు. జట్టుకు వైస్ కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా పేస్ విభాగానికి నాయకత్వం వహించనున్నాడు. భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. కాగా, ఈ సిరీస్‌లో మహ్మద్ షమీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. కాగా, ఇటీవల రోహిత్ శర్మను టీ20, వన్డేలకు కెప్టెన్‌గా చేసిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితులు ఎదురవడంతో కేఎల్ రాహుల్ ని కెప్టెన్ ని చేశారు.