Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం..

ఎండాకాలంలో బాగా నానబెట్టిన చింతగింజలు తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

Tamarind Nuts : చింత గింజలతో ఆరోగ్య చింతలు దూరం..

Tamarind Seed

Tamarind Nuts : చింతపండుకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో ఉండే ఫైటో న్యూట్రియెంట్స్ వలన బాడీ హెల్దీగా ఉంటుంది. చింత పండులో ఉండే టార్టారిక్ యాసిడ్ ఒక పవర్‌ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, ఇది ఫ్రీ రాడికల్స్ పెరగకుండా నిరోధిస్తుంది. చింత పండు మెటబాలిజం ని స్టిమ్యులేట్ చేస్తుంది. జీర్ణ వ్యవస్థని బలంగా ఉంచుతుంది. చింత పండులో ఉండే ఫైబర్ వల్ల మలబద్దకం లాంటి సమస్యలు ఉండవు. సహజంగా చింతకాయలో ఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లో ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

చింతగింజల్లో ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. కావున చింత గింజలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. ప్రతిరోజు చింత గింజల పొడిని పాలు లేదా నీళ్లలో కలిపి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ద‌గ్గు, గొంతు ఇన్‌ఫెక్ష‌న్లు, డ‌యాబెటిస్‌, గుండె సంబంధ వ్యాధులకు చ‌క్క‌ని ఔష‌ధంగా కూడా ఉప‌యోగ‌ప‌డుతుంది.

చింత గింజల్లో పొటాషియం అధికంగా అధికంగా ఉంటుంది కావున ప్రతిరోజు చింత గింజల పొడిని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. చింత గింజల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు మన శరీరంలో క్యాన్సర్ కారకాలను సమర్థవంతంగా నియంత్రిస్తాయి.

చింత గింజల్లో డైటరీ ఫైబర్ అధికంగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థని మెరుగు పరుచుకోవడానికి సహాయ పడటమే కాకుండా మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ప్రభావంతంగా పనిచేస్తుంది. చింత గింజలపై పొట్టు తీసి మెత్తటి పొడిగా తయారు చేస్తారు. దానిని బిస్కెట్ తయారీలో వినియోగిస్తారు.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. చింతగింజల పొడిని ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ కలిపి రోజుకి రెండుసార్లు తాగడం వల్ల రక్తంలో చక్కెర లెవల్స్ ను తగ్గించే ప్రమాదకర డయాబెటిస్ వ్యాధిని అదుపులో ఉంచుతుంది. చింత గింజల పొడిని ప్రతిరోజు పాలల్లో కలుపుకొని తాగడం వల్ల ఆర్థరైటిస్ నొప్పులు తగ్గించుకోవచ్చు. ఇలా చేస్తే కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి అవుతుంది. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి ల‌భిస్తుంది.

ఎండాకాలంలో బాగా నానబెట్టిన చింతగింజలు తినడం వల్ల కడుపులో చల్లగా ఉంటుంది. చింతగింజల పొడిని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు, నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి. ఆ పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన ఉండదు.

చింత గింజల పొడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మొదట నాణ్యమైన చింత గింజలను సేకరించి దోరగా వేయించి మెత్తటి పొడితయారు చేసుకోవాలి. తయారు చేసుకున్న పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోని ప్రతిరోజు పాలు లేదా నీటిలో అర టీ స్పూన్ చింత గింజల పొడిని కలిపి తీసుకుంటే ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు.