Indias squad for ICC Womens Cricket World Cup 2025
Womens ODI World Cup 2025 : ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ సెప్టెంబర్ 30 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగాటోర్నీలో పాల్గొనే భారత మహిళల జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల గల బృందాన్ని ఎంపిక చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోనే టీమ్ఇండియా వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగనుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది.
నిలకడగా ఆడుతున్న ఓపెనర్ ప్రతికా రావల్, హర్లీన్ డియోల్‌లు జట్టులో తమ స్థానాలను నిలుపుకున్నారు. గాయం కారణంగా జట్టుకు దూరం అయిన రేణుకా సింగ్ కు చోటు దక్కింది. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో రాణించిన క్రాంతి గౌడ్, శ్రీచరణిలకు కూడా సెలక్టర్లు ఛాన్స్ ఇచ్చారు. అయితే.. స్టార్ ఓపెనర్ షఫాలీ వర్మకు జట్టులో చోటు దక్కలేదు. ప్రపంచకప్‌కు ఎంపికైన జట్టులో శ్రీచరణి, అరుంధతి రెడ్డి ఇద్దరు కూడా తెలుగమ్మాలు కావడం విశేషం.
వన్డే ప్రపంచకప్ 2025 కోసం భారత మహిళల జట్టు ఇదే..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రేణుకా సింగ్ ఠాకూర్, అరుంధతి రెడ్డి, రిచా ఘోష్ (వికెట్ కీపర్), క్రాంతి గౌడ్, అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, యాస్తికా భాటియా (వికెట్ కీపర్) స్నేహ రానా
#TeamIndia squad for ICC Women’s Cricket World Cup 2025⬇️
Harmanpreet Kaur (Capt), Smriti Mandhana (VC), Pratika Rawal, Harleen Deol, Deepti Sharma, Jemimah Rodrigues, Renuka Singh Thakur, Arundhati Reddy, Richa Ghosh (WK), Kranti Gaud, Amanjot Kaur, Radha Yadav, Sree Charani,…
— BCCI Women (@BCCIWomen) August 19, 2025
భారత్, శ్రీలంక దేశాలు మహిళ వన్డే ప్రపంచకప్ 2025(Womens ODI World Cup 2025)కి ఆతిథ్యం ఇస్తున్నాయి. టీమ్ఇండియా ఇంత వరకు వన్డే ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఈ క్రమంలో హర్మన్ నాయకత్వంలో తొలిసారి వన్డే కప్‌ను ముద్దాడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇటీవల వన్డే క్రికెట్‌లో భారత మహిళల జట్టు అద్భుతంగా రాణిస్తోంది. ఈ ఏడాది 11 వన్డేలు ఆడగా 9 వన్డేల్లో విజయం సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో టీమఇండియా షెడ్యూల్ ఇదే..
* సెప్టెంబర్ 25న – భారత్ వర్సెస్ శ్రీలంక
* అక్టోబర్ 5 న – భారత్ వర్సెస్ పాకిస్తాన్
* అక్టోబర్ 9న – భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా
* అక్టోబర్ 12న – భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా
* అక్టోబర్ 19న – భారత్ వర్సెస్ ఇంగ్లాండ్
* అక్లోబర్ 23న – భారత్ వర్సెస్ న్యూజిలాండ్
* అక్టోబర్ 27న – భారత్ వర్సెస్ బంగ్లాదేశ్