Virat Kohli, Rohit Sharma (Image Credit To Original Source)
IND Vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. భారత వన్డే జట్టులో శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్‌కీపర్)*, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్ ఉన్నారు.
Also Read: యెమెన్‌లో సౌదీ, యూఏఈ మధ్య ఘర్షణలకు కారణాలేంటి? ఈ 2 పవర్‌ఫుల్ ఇస్లామిక్ దేశాల మధ్య ఏం జరుగుతోంది?
శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉంటాడా? అన్న విషయం బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది.
అలాగే, హార్దిక్ పాండ్యా ఒక మ్యాచ్‌లో పది ఓవర్లు బౌలింగ్ చేయడానికి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఇంకా అనుమతి పొందలేదు. ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ ఉండటంతో అతడిపై పడే భారాన్ని కంట్రోల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
భారత్‌లో న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు జరుగుతాయి. మొదటి వన్డే జనవరి 11 (ఆదివారం)న వడోదరలో జరుగుతుంది. రెండో వన్డే జనవరి 14న (బుధవారం) రాజ్‌కోట్‌లో, మూడో వన్డే జనవరి 18 (ఆదివారం)న ఇండోర్‌లో జరగనుంది.