Indonesia Open 2022: తొలి రౌండ్‌లోనే నిష్క్రమించిన సింధు, సాయి ప్రణీత్
: జకార్తాలోని ఇస్టోరాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓటమికి గురయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్ 2022 ఆశలు నీరుగారాయి.

Korea Open Badminton Pv Sindhu Loses To An Seyoung Again, Suncheon Campaign Ends At Semis
Indonesia Open 2022: జకార్తాలోని ఇస్టోరాలో మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌లో పీవీ సింధు, సాయి ప్రణీత్ ఓటమికి గురయ్యారు. చైనాకు చెందిన హీ బింగ్ జియావో చేతిలో ఓడిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్ 2022 ఆశలు నీరుగారాయి. గతవారం ముగిసిన ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ 500 టోర్నమెంట్లోనూ పీవీ సింధుకు నిరాశే మిగిలింది. ఉమెన్ సింగిల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్స్ చేరిన సింధు.. కేవలం 33 నిమిషాల్లోనే గేమ్ కోల్పోయింది.
తొలి రౌండ్‌లోనే అగ్రశ్రేణి అన్‌సీడెడ్ షట్లర్‌గా ఉన్న ప్రపంచ నం. 9 ర్యాంకు హీ బింగ్ జియావోతో తలపడాల్సి రావడంతో సింధుకు గట్టి డ్రా లభించింది. ఓపెనింగ్ గేమ్‌లో 2-9తో పరాజయం పాలైంది. ఆమె పోరాడి 10-12తో నిలిచినా.. హీ బింగ్ జియావో ధాటికి నిలవలేదు.
రాబోయే నెల కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు మళ్లీ పీక్ ఫామ్‌ను అందుకునేందుకు ప్రయత్నిస్తోంది సింధు.
Read Also : పీవీ సింధు ఓటమి… అయినా పతకం
ఇదిలా ఉండగా, ప్రపంచ 19వ ర్యాంకర్ పురుషుల సింగిల్స్ ఈవెంట్‌లో ఓపెనింగ్ రౌండ్‌లోనే ఓడిపోవడంతో మాజీ ప్రపంచ ఛాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత సాయి ప్రణీత్ పేలవంగా ముగించారు. ప్రణీత్ 16-21, 19-21తో డెన్మార్క్‌కు చెందిన హన్స్ క్రిస్టియన్ విట్టింగ్‌హస్‌తో 45 నిమిషాల్లో ఓడిపోయాడు.
2 సార్లు ఛాంపియన్‌గా నిలిచిన సైనా నెహ్వాల్ టోర్నీ నుంచి వైదొలగడంతో మహిళల సింగిల్స్ విభాగంలో భారత్ కథ ముగిసినట్లే.