×
Ad

Deepti Sharma : దీప్తి శ‌ర్మ ప్ర‌పంచ రికార్డు.. మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో ఏకైక బౌల‌ర్‌..

అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా దీప్తి శ‌ర్మ (Deepti Sharma) చ‌రిత్ర సృష్టించింది.

INDw vs SLW 5th T20 Deepti Sharma becomes highest wicket taker in WT20I history (PIC credit @BCCIWomen)

  • మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో దీప్తి శ‌ర్మ అరుదైన ఘ‌న‌త‌
  •  అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా
  • ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ మేగ‌న్ ష‌ట్‌ను అధిగ‌మించి

Deepti Sharma : టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండ‌ర్ దీప్తి శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించింది. అంత‌ర్జాతీయ మ‌హిళ‌ల టీ20 క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టించింది. మంగ‌ళ‌వారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో శ్రీలంక మ‌హిళ‌ల జ‌ట్టుతో జ‌రిగిన మ్యాచ్‌లో వికెట్ తీయ‌డం ద్వారా దీప్తి ఈ ఘ‌న‌త సాధించింది.

ఈ మ్యాచ్‌లో లంక ఇన్నింగ్స్ 14వ ఓవ‌ర్‌లో శ్రీలంక బ్యాటర్‌ నీలాక్షిక సిల్వాను ఎల్బీడ‌బ్ల్యూగా ఔట్ చేసి దీప్తి శ‌ర్మ ఈ ఘ‌న‌త అందుకుంది. ఈ క్ర‌మంలో ఆమె ఆస్ట్రేలియా స్టార్ ప్లేయ‌ర్ మేగ‌న్ ష‌ట్‌ను అధిగ‌మించింది. మ‌హిళ‌ల‌ అంత‌ర్జాతీయ టీ20 క్రికెట్‌లో ష‌ట్ 151 వికెట్లు తీయ‌గా.. లంకతో మ్యాచ్‌లో వికెట్ దీప్తికి 152 వికెట్.

Smriti Mandhana : గిల్ వ‌ర‌ల్డ్ రికార్డు సేఫ్‌.. బ్రేక్ చేయ‌లేకపోయిన మంధాన‌.. కార‌ణం ఇదే..

మ‌హిళ‌ల అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే..

* దీప్తి శ‌ర్మ (భార‌త్) – 152 వికెట్లు
* మేఘ‌న్ ష‌ట్ (ఆస్ట్రేలియా) – 151 వికెట్లు
* నిదా దార్ (పాకిస్తాన్‌) – 144 వికెట్లు
* హెన్రియెట్ ఇషిమ్వే – 144 వికెట్లు
* సోఫీ ఎక్లెస్టోన్ – 142 వికెట్లు

ఇక ఈ మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. తొలుత భార‌త్ బ్యాటింగ్ చేసింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (68; 43 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచ‌రీ చేయ‌గా అరుంధతి రెడ్డి (27 నాటౌట్‌; 11 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) వేగంగా ఆడ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది.

Renuka Singh : రెడ్ డ్రెస్‌లో టీమ్ఇండియా పేస‌ర్ హోయ‌లు.. ఫోటోలు..

ఆ త‌రువాత హాసిని పెరీరా (65; 42 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్‌), ఇమేషా (50; 39 బంతుల్లో 8 ఫోర్లు) అర్ధ‌శ‌త‌కాల‌తో రాణించిన‌ప్ప‌టికి కూడా 176 ప‌రుగుల ల‌క్ష్య ఛేద‌న‌లో లంక జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులే చేయ‌గ‌లిగింది. దీంతో భార‌త్ 15 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. త‌ద్వారా 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 5-0 తేడాతో క్లీన్ స్వీప్ చేసింది.