Arundhati Reddy: మహిళల వన్డే ప్రపంచ కప్-2025ను గెలవడం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవడం పట్ల భారత క్రికెటర్ అరుంధతి రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచ కప్ సాధించిన తర్వాత ఇటీవలే ఆమె హైదరాబాద్‌కు వచ్చిన విషయం తెలిసిందే.
10టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అరుంధతి రెడ్డి మాట్లాడింది. స్మృతి మంధాన 100 రన్స్ కొట్టినా ఇంకా కొట్టాలని అంటామని, ఎందుకు ఔట్ అయ్యావని అంటామని చెప్పింది. స్మృతి మంధాన ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుందని తెలిపింది. ఆమె క్రీజులో ఉంటే అందరూ ధైర్యంగా ఉంటారని చెప్పింది. ఒత్తిడిలోనూ ఆమె ఆడుతుందని తెలిపింది. (Arundhati Reddy)
వరల్డ్ కప్ గెలిచిన తర్వాత తాను హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో తనకు ఘనస్వాగతం పలకడానికి అంత మంది జనాలు వస్తారని అనుకోలేదని తెలిపింది.
వరల్డ్ కప్‌లో వరుసగా మూడు మ్యాచులు ఓడిపోయినప్పుడు.. అయ్యిందేదో అయిపోయిందని, ఇక నుంచి మనం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టామని చెప్పింది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మను చూస్తూ తాము చాలా మోటివేట్ అవుతామని అరుంధతి రెడ్డి తెలిపింది. ఉమెన్స్ క్రికెట్‌ను జైషా మార్చేశారని చెప్పింది. తాను గతంలో అబ్బాయి గెటప్‌లో వెళ్లి అబ్బాయిలతో క్రికెట్ ఆడేదాన్నని తెలిపింది.
ఫైనల్ కంటే ఆస్ట్రేలియా మీద గెలిచినప్పుడే ఎక్కువ సంతోషపడ్డామని అరుంధతి రెడ్డి చెప్పింది. హర్మన్‌ప్రీత్ గ్రౌండ్‌లో ఫైర్.. బయట కూల్‌గా ఉంటుందని తెలిపింది.
Also Read: లెస్బియన్ పార్ట్‌నర్‌తో కలిసి.. సొంత కుమారుడిని హత్య చేసిన మహిళ.. ఎందుకంటే?
అరుంధతి రెడ్డి ప్రస్తుతం బీకాం ఫైనల్ ఇయర్ చదువుతోంది. చదువు, క్రికెట్ రెండింటినీ సమర్థంగా కొనసాగిస్తోంది. 2024లో ఆమె పర్ఫార్మన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అరుంధతి 4 వికెట్లు తీసి, కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చింది.
తరువాత భారత్‌లో జరిగిన న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో కీలక పాత్ర పోషించింది. బాగా రాణించి గేమ్ ఛేంజర్ అవార్డు అందుకుంది.
టీ20 వరల్డ్ కప్ -2024 (దుబాయ్)లో కూడా ఆమె అద్భుత బౌలింగ్‌తో మెరిసింది. పాకిస్థాన్‌పై 3 వికెట్లు తీసి, 19 పరుగులు మాత్రమే ఇచ్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. శ్రీలంకపై మళ్లీ 3 వికెట్లు తీసి 19 మాత్రమే ఇచ్చింది.
మొత్తం 4 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీసి, టోర్నమెంట్‌లో భారత జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. అరుంధతి ఇప్పటివరకు 3 టీ20 వరల్డ్ కప్‌లలో.. 2018 (వెస్టిండీస్), 2020 (ఆస్ట్రేలియా), 2024 (దుబాయ్)లో కూడా ఆడింది. 2021లో ఇంగ్లాండ్ పర్యటనలో ఆమెను మూడు ఫార్మాట్‌లకు (టెస్ట్, వన్డే, టీ20) ఎంపిక చేశారు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2023లో అరుంధతిని ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. రెండు సీజన్‌లలో ఢిల్లీ జట్టు ఫైనల్‌కి చేరింది. రెండవ సీజన్‌లో అరుంధతి భారత ఫాస్ట్ బౌలర్లలో అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్‌గా నిలిచింది. అరుంధతి హైదరాబాద్ జట్టు తరఫున అండర్-16, అండర్-19, అండర్-23 స్థాయుల్లో కెప్టెన్‌గా వ్యవహరించింది.