మరో వారం రోజుల్లో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్‌లలో విజయం సాధించిన ఢిల్లీ, చెన్నైలు టాప్ 1, 2స్థానాల్లో కొనసాగుతున్నాయి.
మరో వారం రోజుల్లో ఐపీఎల్ లీగ్ దశ ముగియనుంది. ఇప్పటికే ఆడిన 12మ్యాచ్‌లలో విజయం సాధించిన ఢిల్లీ, చెన్నైలు టాప్ 1, 2స్థానాల్లో కొనసాగుతున్నాయి. మే1 బుధవారం ఇరు జట్ల మధ్య మ్యాచ్ రూపంలో టాప్ స్థానం కోసం పోరాటం జరుగుతోంది. చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ లేనప్పటి నుంచి వరుసగా ఓటములు చవిచూస్తున్న సూపర్ కింగ్స్ ఈ మ్యాచ్‌లో రాణిస్తుందనడం సందేహమే.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ధోనీ జ్వరం కారణంగా ఆడలేకపోయాడు. కొద్ది రోజుల క్రితం ధోనీ లేకుండానే సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో చెన్నై ఆడిన మ్యాచ్‌లోనూ పరాజయమే మిగిలింది. రెండు రోజులుగా వెన్నునొప్పి, అనారోగ్యం కారణంగా ప్రాక్టీస్ క్యాంప్‌లోనూ కనిపించడం లేదు.
సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాత్రం.. ‘ధోనీ కోలుకుంటున్నాడు. రేపటికల్లా అతనిని సంప్రదిస్తామని’ మంగళవారం మీడియాతో చెప్పాడు. ధోనీ లేనిదే చెన్నై జట్టు గెలవలేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. సురేశ్ రైనా, కేదర్ జాదవ్, అంబటి రాయుడు లాంటి స్టార్ బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ సత్ఫలితాలు కనిపించడం లేదు.
మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్.. సౌరవ్ గంగూలీ, రిక్కీ పాంటింగ్ సూచనలు.. సలహాలతో జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. శిఖర్ ధావన్, రిషబ్ పంత్, పృథ్వీ షాలు కలిసి రాణిస్తుండటంతో టాప్ స్థానంలో నిలుస్తుందనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.
Also Read : ఇంటికి కెప్టెన్: గుడ్ బై చెప్పేసిన స్టీవ్ స్మిత్