IPL 2021 CSK Vs DC పృథ్వీ షా విధ్వంసం.. చెన్నై ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యా

IPL 2021 CSK Vs DC : ఐపీఎల్ 2021 క్వాలిఫయర్-1లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ కేపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ భారీ స్కోరు చేసింది. ఢిల్లీ ఓపెనర్ పృథ్వీ షా విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ రిషబ్ పంత్, షిమ్రోన్ హెట్మెయర్ దూకుడుగా ఆడారు. దీంతో డీసీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసింది.

Face Book Friend Cheating : ఫేస్‌బుక్ లో పరిచయం….రూ. 27లక్షలు దోచేసిన యువతులు

పృథ్వీ షా 34 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేశాడు. పంత్ 35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. హెట్మెయర్ 24 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 37 పరుగులు నమోదు చేశాడు.

దసరా పండుగ, ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు ఉండవ్

ఓపెనర్ శిఖర్ ధావన్ (7), శ్రేయాస్ అయ్యర్ (1) విఫలమయ్యారు. చెన్నై బౌలర్లలో జోష్ హేజెల్ వుడ్ కు 2 వికెట్లు లభించాయి. జడేజా, మొయిన్ అలీ, బ్రావో తలో వికెట్ తీశారు.

ట్రెండింగ్ వార్తలు