IPL 2021 MI Vs RCB : మ్యాక్స్ వెల్ ఈజ్ బ్యాక్.. ముంబై టార్గెట్ 166

ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కో

Ipl 2021 Mi Vs Rcb

IPL 2021 MI Vs RCB : ఐపీఎల్ 2021 రెండో సీజన్ లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తలపడుతున్నాయి. తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లి సేన 6 వికెట్లకు 165 పరుగులు చేసింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (51; 42 బంతుల్లో 3×4, 3×6), మ్యాక్స్‌వెల్ (56; 37 బంతుల్లో 6×4, 6×3) రాణించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు..బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో ఓపెనర్ పడిక్కల్‌(0) వికెట్‌ని కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రీకర్‌ భరత్‌ (32; 24 బంతుల్లో 2×4, 2×6) ఫర్వాలేదనింపించాడు.

Rakul Preet Singh: షాకింగ్.. రకుల్ పెదవులకు సర్జరీ?

విరాట్‌ ఔటైన తర్వాత మ్యాక్స్‌వెల్‌ జోరు పెంచాడు. మిల్నే వేసిన 18వ ఓవర్లో ఓ సిక్స్‌, రెండు ఫోర్లు బాదాడు. 19వ ఓవర్‌ వేసిన బుమ్రా.. మ్యాక్స్‌వెల్, డివిలియర్స్‌(11) వరుస బంతుల్లో ఔట్‌ చేసి ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. బౌల్ట్‌ వేసిన చివరి ఓవర్‌లో షాబాబ్‌ అహ్మద్‌ (1) పెవిలియన్ చేరాడు. క్రిస్టియాన్‌(1), జేమీసన్‌(2) నాటౌట్‌గా నిలిచారు. ముంబయి బౌలర్లలో బుమ్రా మూడు, రాహుల్‌ చాహర్‌, మిల్నే, బౌల్ట్‌ తలో వికెట్‌ తీశారు.

Milk Dairy: సాఫ్ట్‌వేర్ వదిలి పాలడైయిరీతో సక్సెస్