Rcb Captain
IPL 2022: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ ఆరంభానికి మరో మూడు వారాల సమయం మాత్రమే ఉంది. లీగ్ లో ఫ్రాంచైజీలన్నింటికీ కెప్టెన్లు ఉండగా కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి కెప్టెన్ ఖరారు కాకపోవడంపై అందరి కళ్లు ఆ జట్టుపైనే ఉన్నాయి. కొత్తగా వచ్చిన లక్నో సూపర్ జెయంట్స్, గుజరాత్ టైటాన్సి కూడా వేలం ముగిసిన రోజుల వ్యవధిలోనే కెప్టెన్లను ప్రకటించేశాయి.
ఇక ఫ్రాంచైజీ గ్లెన్ మ్యాక్స్ వెల్, డుప్లెసిస్ నైనా కన్ఫామ్ చేస్తాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు బెంగళూరు అభిమానులు. ఐపీఎల్ 2021 సీజన్ ముగింపు సమయంలో తాను కెప్టెన్సీ రోల్ నుంచి వైదొలుగుతున్నట్లు విరాట్ ప్రకటించడంతో మొదలైంది ఈ రచ్చ. ఇప్పటికే టీమిండియాలో ఫార్మాట్లకు కూడా కెప్టెన్సీపై వీడ్కోలు చెప్పేయడంతో ఆర్సీబీ కెప్టెన్సీ వెనక్కు తీసుకోడని స్పష్టమైపోతుంది.
వర్క్ లోడ్ ఎక్కువ అవుతుందని స్ట్రెస్ తగ్గించుకోవాలనే తాను ఆర్సీబీ కెప్టెన్ గా వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు విరాట్. కాకపోతే గత నెలలో ఫ్రాంచైజీ కోహ్లీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని, నిర్ణయం వెనక్కు తీసుకున్నా ఆశ్చర్యం లేదని చెప్పింది.
Read Also: పుష్ప ట్రెండ్‌లో జాయిన్ అయిన విరాట్ కోహ్లీ
ఇదిలా ఉంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాజీ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ సరైన నిర్ణయం తీసుకున్నాడని మరోసారి కెప్టెన్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదని అన్నాడు.
‘లేదు (కోహ్లీ మళ్లీ కెప్టెన్ అవడు). నాకు తెలిసి ఇది చాలా సింపుల్. ఇది పనిచేస్తుందని అనుకోను. ఒకసారి కెప్టెన్ గా ఉండనని నిర్ణయం తీసుకుంటే అలా ఉండిపోవాలంతే. అదే సరైనది’ అని వెట్టోరీ ఈఎస్పీఎన్ మీడియాతో మాట్లాడుతూ అన్నారు.
Read Also: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను ఆస్ట్రేలియా లీడర్ కు బహుకరించిన విదేశాంగ శాఖ మంత్రి