Virat Kohli: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను ఆస్ట్రేలియా లీడర్ కు బహుకరించిన విదేశాంగ శాఖ మంత్రి

టీమిండియా క్రికెట్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా లీడర్ మరీస్ పైనెకు బహుకరించారు.

Virat Kohli: కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను ఆస్ట్రేలియా లీడర్ కు బహుకరించిన విదేశాంగ శాఖ మంత్రి

Jaishankar

Virat Kohli: టీమిండియా క్రికెట్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్‌ను మెల్‌బౌర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా లీడర్ మరీస్ పైనెకు బహుకరించారు. క్వాడ్ విదేశాంగ మంత్రుల కీలక సమావేశానికి హాజరైన జయశంకర్, “ఫిట్టింగ్ ఎండ్ టూ ఏ బిజీ డే”లో మిస్ పేనె, US సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్, జపాన్ విదేశాంగ మంత్రి హయాషి యోషిమాసాతో కలిసి ఆస్ట్రేలియాలోని అతిపెద్ద గౌరవనీయమైన క్రీడా స్టేడియంను సందర్శించారు.

క్వాడ్ విదేశాంగ శాఖ మంత్రుల మీటింగ్ కు మిస్ పేనె హాజరయ్యారు.

‘క్వాడ్ మంత్రుల సదస్సు మెల్ బౌర్న్ స్టేడియంలో జరిగింది. విరాట్ కోహ్లీ సంతకం చేసిన బ్యాట్ ను తొలిసారి ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా మేరిస్ పేనెకు బహుకరించా’ నంటూ జయ్ శంకర్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

Read Also : రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. 11వ రోజు, ఉప రాష్ట్రపతి రాక

33 ఏళ్ల విరాట్ కోహ్లి, టెస్ట్ కెప్టెన్సీ, వన్డే కెప్టెన్సీ రాజీనామా ఇటీవల ముగిసింది. 68 మ్యాచ్‌లలో 40 విజయాలతో అత్యంత విజయవంతమైన భారత టెస్ట్ కెప్టెన్ గా రికార్డులకెక్కాడు.

1853లో స్థాపించిన (MCG) మెల్‌బౌర్న్ స్థాపించిన 20 సంవత్సరాలలోపు, 1859 నుండి ఆస్ట్రేలియన్ ఫుట్‌బాల్‌కు నిలయంగా ఉంది. 1877లో టెస్ట్ క్రికెట్, 1971లో వన్డే అంతర్జాతీయ క్రికెట్‌కు జన్మస్థలంగా నిలిచింది. లక్ష కంటే ఎక్కువ మంది కూర్చొనే కెపాసిటీ ఉన్న స్టేడియం ఆస్ట్రేలియాలో అతిపెద్ద క్రీడా వేదిక.