Statue of Equality : 11వ రోజు రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. ఇవాళ ఉప రాష్ట్రపతి రాక

12వ తేదీ శనివారం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉప రాష్ట్రపతి, ఆదివారం రాష్ట్రపతి రాక...

Statue of Equality : 11వ రోజు రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు.. ఇవాళ ఉప రాష్ట్రపతి రాక

Vice

Statue of Equality : ముచ్చింతల్‌లో భగవత్‌ శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శనివారం 11వ రోజు ఉదయం 6.30 గంటలకు అష్టాక్షరీ మంత్ర పఠనం జరిగింది. ఉదయం 7.30 గంటలకు శ్రీపెరుమాళ్‌ స్వామికి ప్రాతఃకాల ఆరాధన, ఉదయం 8 గంటలకు వేదపారాయణం జరుగనుంది. మరోవైపు.. రామానుజాచార్యుల సహస్రాబ్ది వేడుకల్లో.. ప్రతీరోజూ పెద్ద సంఖ్యలో పీఠాధిపతులు, మఠాధిపతులు, ఆచార్యులరాకతో సందడిగా మారింది. అటు సమతామూర్తి సందర్శనకు కేంద్ర అతిథులు, సామాన్య భక్తుల తాకిడి పెరుగుతోంది.

Read More : Twitter : ట్విట్టర్ సేవలకు అంతరాయం.. యూజర్ల ఫిర్యాదు

సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తరలివచ్చి సమతామూర్తిని దర్శించుకుని వెళ్తున్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శ్రీరామనగరికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక 2022, ఫిబ్రవరి 12వ తేదీ శనివారం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు విచ్చేయనున్నారు. సాయంత్రం 6.20కి శ్రీరామనగరం చేరుకున్న అనంతరం 6.25కి 108 దివ్యదేశాలను దర్శించుకుంటారు. అక్కడి నుంచి 6.40కి రామానుజుల బంగారు మూర్తిని
6.45 కు సమతా మూర్తిని చూడనున్నారు. 7 గంటలకు 3డి మ్యాప్ లేజర్ షో చూసిన అనంతరం 7.18కి వెంకయ్యకు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి, రామేశ్వర్ రావులు సన్మానం చేయనున్నారు.

Read More : Virat Kohli : అయ్యయ్యో… 3 వన్డేల్లో 26 పరుగులు, 8సార్లు డకౌట్.. విరాట్ కోహ్లికి ఏమైంది?

ప్రవచనాల వేదికపై 7.38కి శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలపై వెంకయ్య నాయుడు ప్రసంగం చేస్తారు. 8 గంటలకు యాగశాలలో శ్రీ లక్ష్మీ నారాయణ యజ్ఞ పూర్ణాహుతిలో పాల్గొంటారు. తర్వాత వేద పండితులు, 5 వేల మంది ఋత్విజులు.. ఆశీర్వచనం చేస్తారు. 8.25కు శ్రీరామ నగరం నుంచి ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు బయలుదేరుతారు. వెంకయ్యతో పాటు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. శనివారం ఉప రాష్ట్రపతి, ఆదివారం రాష్ట్రపతి రాక సందర్భంగా పలు ఆంక్షలు ఉంటాయని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వెల్లడించారు. భక్తులు సహకరించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉంటే ..నక్షత్ర, రాశి ఆధారంగా దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట జరుగుతోంది. ప్రాణప్రతిష్ట అనంతరం మహాసంప్రోక్షణ, కుంభాభిషేకాలు నిర్వహించారు. ఇప్పటికే ఈనెల 7న 108 దివ్యదేశాల్లో 32 దివ్యదేశాల ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేసిన సంగతి తెలిసిందే. 10న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట చేశారు. ఇక 13న 20 దివ్యదేశ ఉత్సవమూర్తులకు ప్రాణప్రతిష్ట నిర్వహించారు.