CSK vs MI
IPL 2023, CSK vs MI: ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది.
ఐపీఎల్(IPL) 2023లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్(Mumbai Indians)తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఘన విజయం సాధించింది. 140 పరుగు లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
చెన్నై జట్టు మరో వికెట్ కోల్పోయింది. ఆకాష్ మధ్వల్ బౌలింగ్‌లో డెవాన్ కాన్వే(44) ఎల్భీగా ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 130 పరుగుల(16.3వ ఓవర్) వద్ద నాలుగో వికెట్‌ను కోల్పోయింది. 17 ఓవర్లకు చెన్నై స్కోరు 132/4. ధోని(1), శివమ్ దూబే(19) లు క్రీజులో ఉన్నారు.
16వ ఓవర్‌ను ట్రిస్టన్ స్టబ్స్ కట్టుదిట్టంగా వేయడంతో 5 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు చెన్నై స్కోరు 128/3. డెవాన్ కాన్వే(43), శివమ్ దూబే(17) లు క్రీజులో ఉన్నారు.
15వ ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులే వచ్చాయి. 15 ఓవర్లకు చెన్నై స్కోరు 123/3. డెవాన్ కాన్వే(40), శివమ్ దూబే(15) లు క్రీజులో ఉన్నారు.
14వ ఓవర్‌ను రాఘవ్ గోయల్ వేయగా శివమ్ దూబే రెండు సిక్స్‌లు కొట్టాడు. ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు చెన్నై స్కోరు 119/3. డెవాన్ కాన్వే(38), శివమ్ దూబే(13) లు క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్‌ను ట్రిస్టన్ స్టబ్స్ వేయగా నాలుగో బంతికి సిక్స్ కొట్టిన అంబటి రాయుడు ఆ మరుసటి బంతికే రాఘవ్ గోయల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో చెన్నై 105 పరుగుల(12.5వ ఓవర్) వద్ద మూడో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు చెన్నై స్కోరు 105/3. డెవాన్ కాన్వే(37), శివమ్ దూబే(0) లు క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను రాఘవ్ గోయల్ వేశాడు. ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు చెన్నై స్కోరు 96/2. డెవాన్ కాన్వే(35), అంబటి రాయుడు(5) లు క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్‌ను పీయూష్ చావ్లా కట్టుదిట్టంగా వేయడంతో 4 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు చెన్నై స్కోరు 88/2. డెవాన్ కాన్వే(29), అంబటి రాయుడు(3) లు క్రీజులో ఉన్నారు.
రాఘవ్ గోయల్ పదో ఓవర్‌ను కట్టుదిట్టంగా వేయడంతో ఈ ఓవర్‌లో మూడు పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు చెన్నై స్కోరు 84/2. డెవాన్ కాన్వే(27), అంబటి రాయుడు(1) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. రెండో బంతికి సిక్స్ కొట్టిన రహానే(21) ఆఖరి బంతికి ఎల్భీగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. 9 ఓవర్లకు చెన్నై స్కోరు 81/2. డెవాన్ కాన్వే(25), అంబటి రాయుడు(0) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదవ ఓవర్‌ను రాఘవ్ గోయల్ వేశాడు. రెండో బంతికి కాన్వే ఫోర్ బాదగా మొత్తంగా ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు చెన్నై స్కోరు 73/1. అజింక్యా రహానే (14), డెవాన్ కాన్వే(24) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను పీయూష్ చావ్లా వేశాడు. తొలి బంతికి రహానే ఫోర్ కొట్టగా మొత్తంగా ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు చెన్నై స్కోరు 64/1. అజింక్యా రహానే (10), డెవాన్ కాన్వే(20) లు క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. ఈ ఓవర్‌లో 5 పరుగులే వచ్చాయి. 6 ఓవర్లకు చెన్నై స్కోరు 55/1. అజింక్యా రహానే (3), డెవాన్ కాన్వే(18) లు క్రీజులో ఉన్నారు.
పీయూష్ చావ్లా బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ అందుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్(30) ఔట్ అయ్యాడు. దీంతో 47 పరుగుల(4.1వ ఓవర్) వద్ద చెన్నై తొలి వికెట్ కోల్పోయింది. 5 ఓవర్లకు చెన్నై స్కోరు 50/1. అజింక్యా రహానే (3), డెవాన్ కాన్వే(14) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను జోఫ్రా ఆర్చర్ వేశాడు. డెవాన్ కాన్వె రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు చెన్నై స్కోరు 46/0. రుతురాజ్ గైక్వాడ్(30), డెవాన్ కాన్వే(14) లు క్రీజులో ఉన్నారు.
లక్ష్య ఛేదనలో చెన్నై ఓపెనర్లు ధాటిగా ఆడుతున్నారు. మూడో ఓవర్‌ను అర్షద్ ఖాన్ వేయగా ఈ ఓవర్‌లో రుతురాత్ గైక్వాడ్ రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టడంతో మొత్తంగా 20 పరుగులు వచ్చాయి. 3 ఓవర్లకు చెన్నై స్కోరు 36/0. రుతురాజ్ గైక్వాడ్(29), డెవాన్ కాన్వే(5) లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో నెహల్ వధేరా(64; 51 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించగా సూర్యకుమార్ యాదవ్(26; 22 బంతుల్లో 3 ఫోర్లు), ట్రిస్టన్ స్టబ్స్(20; 20 బంతుల్లో 2 ఫోర్లు) పర్వాలేదనిపించారు. కామెరూన్ గ్రీన్(6), ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ(0)లు విఫలం అయ్యారు. చెన్నై బౌలర్లలో మతీషా పతిరణ మూడు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండేలు చెరో రెండు వికెట్లు, రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు
ముంబై మరో వికెట్ కోల్పోయింది. మతీషా పతిరణ బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవడంతో అర్షద్ ఖాన్(1) ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 134 పరుగుల(19.1వ ఓవర్) వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది.
ముంబై మరో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో రుతురాజ్ గైక్వాడ్ క్యాచ్ అందుకోవడంతో టిమ్ డేవిడ్(2) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో ముంబై 127పరుగుల(18.3వ ఓవర్) వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది.19 ఓవర్లకు ముంబై స్కోరు 134/6. ట్రిస్టన్ స్టబ్స్(20), అర్షద్ ఖాన్(1) లు క్రీజులో ఉన్నారు.
ముంబై మరో వికెట్ కోల్పోయింది. దూకుడుగా ఆడుతున్న నెహాల్ వధేరా(64) ఔట్ అయ్యాడు. దీంతో ముంబై 123 పరుగుల(17.3వ ఓవర్) వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. 18 ఓవర్లకు ముంబై స్కోరు 124/5. ట్రిస్టన్ స్టబ్స్(13), టిమ్‌డేవిడ్(1) లు క్రీజులో ఉన్నారు.
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో రెండు పరుగులు(16.1వ ఓవర్) తీసి నెహాల్ వధేరా 46 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 17 ఓవర్లకు ముంబై స్కోరు 122/4. ట్రిస్టన్ స్టబ్స్(12), నెహాల్ వధేరా(64) లు క్రీజులో ఉన్నారు.
ట్రిస్టన్ స్టబ్స్, నెహాల్ వధేరా లు దూకుడు పెంచుతున్నారు. 16వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేయగా తొలి బంతికి వధేరా సిక్స్ కొట్టగా మూడో బంతికి స్టబ్స్ ఫోర్ బాదాడు. ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లకు ముంబై స్కోరు 106/4. ట్రిస్టన్ స్టబ్స్(11), నెహాల్ వధేరా(49) లు క్రీజులో ఉన్నారు.
15వ ఓవర్‌ను మతీషా పతిరణ వేయగా ఏడు పరుగులు వచ్చాయి. 15 ఓవర్లకు ముంబై స్కోరు 93/4. ట్రిస్టన్ స్టబ్స్(6), నెహాల్ వధేరా(41) లు క్రీజులో ఉన్నారు.
14వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. నాలుగో బంతికి నెహాల్ వధేరా ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు ముంబై స్కోరు 86/4. ట్రిస్టన్ స్టబ్స్(5), నెహాల్ వధేరా(39) లు క్రీజులో ఉన్నారు.
13వ ఓవర్‌ను మతీషా పతిరణ వేశాడు. ఈ ఓవర్‌లో ఐదు పరుగులు వచ్చాయి. 13 ఓవర్లకు ముంబై స్కోరు 79/4. ట్రిస్టన్ స్టబ్స్(5), నెహాల్ వధేరా(32) లు క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను మహేశ్ తీక్షణ కట్టుదిట్టంగా వేయడంతో 3 పరుగులే వచ్చాయి. 12 ఓవర్లకు ముంబై స్కోరు 74/4. ట్రిస్టన్ స్టబ్స్(2), నెహాల్ వధేరా(30) లు క్రీజులో ఉన్నారు.
రవీంద్ర జడేజా బౌలింగ్‌లో సూర్యకుమార్ యాదవ్(26) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 69 పరుగుల(10.3వ ఓవర్) వద్ద ముంబై నాలుగో వికెట్ కోల్పోయింది. 11 ఓవర్లకు ముంబై స్కోరు 71/4. ట్రిస్టన్ స్టబ్స్(1), నెహాల్ వధేరా(28) లు క్రీజులో ఉన్నారు.
పదో ఓవర్‌ను మహేశ్ తీక్షణ వేశాడు. నాలుగో బంతికి సూర్యకుమార్ ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు ముంబై స్కోరు 64/3. సూర్యకుమార్ యాదవ్(26), నెహాల్ వధేరా(22) లు క్రీజులో ఉన్నారు.
తొమ్మిదో ఓవర్‌ను రవీంద్ర జడేజా కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు ముంబై స్కోరు 59/3. సూర్యకుమార్ యాదవ్(22), నెహాల్ వధేరా(21) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదో ఓవర్‌ను మొయిన్ అలీ వేశాడు. సూర్యకుమార్, నెహల్ వధేరా చెరో ఫోర్ కొట్టడంతో ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 8 ఓవర్లకు ముంబై స్కోరు 55/3. సూర్యకుమార్ యాదవ్(20), నెహాల్ వధేరా(19) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను రవీంద్ర జడేజా వేశాడు. మూడో బంతిని నెహాల్ వధేరా బౌండరీగా మలిచాడు. ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు ముంబై స్కోరు 44/3. సూర్యకుమార్ యాదవ్(15), నెహాల్ వధేరా(14) లు క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే వేశాడు. నాలుగో బంతికి సూర్యకుమార్ యాదవ్ ఫోర్ కొట్టడంతో మొత్తంగా ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు ముంబై స్కోరు 34/3. సూర్యకుమార్ యాదవ్(13), నెహాల్ వధేరా(8) లు క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను దీపక్ చాహర్ వేశాడు. రెండో బంతికి నెహాల్ వధేరా ఫోర్ కొట్టడంతో మొత్తంగా ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లకు ముంబై స్కోరు 24/3. సూర్యకుమార్ యాదవ్(4), నెహాల్ వధేరా(7) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను తుషార్ దేశ్‌పాండే కట్టుదిట్టంగా వేయడంతో ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు ముంబై స్కోరు 19/3. సూర్యకుమార్ యాదవ్(4),నెహాల్ వధేరా(2) లు క్రీజులో ఉన్నారు.
ఒకే ఓవర్‌లో దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశాడు. రెండో బంతికి ఇషాన్ కిషన్.. తుషార్ దేశ్‌పాండే చేతికి చిక్కగా ఐదో బంతికి జడేజా క్యాచ్ అందుకోవడంతో రోహిత్ శర్మ పెవిలియన్‌కు చేరుకున్నాడు. 3 ఓవర్లకు ముంబై స్కోరు 16/3. సూర్యకుమార్ యాదవ్(2),నెహాల్ వధేరా(1) లు క్రీజులో ఉన్నారు.
ముంబైకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి. ఇషాన్ కిషన్(7) ఔటైయ్యాడు. దీపక్ చాహర్ బౌలింగ్‌లో తుషార్ దేశ్‌పాండే చేతికి చిక్కాడు. దీంతో 13 పరుగుల(2.2వ ఓవర్) వద్ద ముంబై రెండో వికెట్ కోల్పోయింది.
ఆరంభంలోనే ముంబైకి ఎదురుదెబ్బ తగిలింది. తుషార్ దేశ్‌పాండే బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్(6) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 13 పరుగుల(1.5వ ఓవర్) వద్ద ముంబై తొలి వికెట్ కోల్పోయింది. 2 ఓవర్లకు ముంబై స్కోరు 13/1. ఇషాన్ కిషన్(7), రోహిత్ శర్మ(0) లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడి ముంబై బ్యాటింగ్‌కు దిగింది. ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్ లు ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్‌ను దీపక్ చాహర్ వేయగా కిషన్, గ్రీన్‌లు చెరో ఫోర్ కొట్టారు. 1 ఓవర్‌కు ముంబై స్కోరు 10/0. ఇషాన్ కిషన్(5), కామెరూన్ గ్రీన్(5) లు క్రీజులో ఉన్నారు.
రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, టిమ్ డేవిడ్, నెహాల్ వధేరా, జోఫ్రా ఆర్చర్, పీయూష్ చావ్లా, ఆకాష్ మధ్వల్, అర్షద్ ఖాన్
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, మొయిన్ అలీ, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ(కెప్టెన్), దీపక్ చాహర్, మతీషా పతిరణ, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ
చిదంబరం స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో తొలుత ముంబై బ్యాటింగ్ చేయనుంది.