LSG vs GT
IPL 2023, GT vs LSG :IPL 2023, GT vs LSG: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) విజయం సాధించింది. లక్ష్య ఛేదనలో లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ 56 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో బ్యాటర్లలో క్వింటన్ డికాక్(70 41 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టగా కైల్ మేయర్(48 32బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. గుజరాత్ బౌలర్లలో మోహిత్ శర్మ నాలుగు వికెట్లు తీయగా, మహ్మద్ షమీ, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ ఒక్కొ వికెట్ పడగొట్టారు.
ఒకే ఓవర్‌లో లక్నో రెండు వికెట్లు కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో సిక్స్, ఫోర్ కొట్టిన బదోని అదే ఊపులో మరో భారీ షాట్‌కు యత్నించి నూర్ అహ్మద్ క్యాచ్ పట్టడంతో ఔట్ అయ్యాడు. దీంతో 166 పరుగుల(18.5వ ఓవర్) వద్ద లక్నో ఆరో వికెట్ కోల్పోయింది. ఆ మరుసటి బంతికే కృనాల్(0) డేవిడ్ మిల్లర్ చేతికి చిక్కాడు. 19 ఓవర్లకు లక్నో స్కోరు 166/7. స్వప్నిల్ సింగ్(1), రవి బిష్ణోయ్(0) క్రీజులో ఉన్నారు.
లక్నో మరో వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన నికోలస్ పూరన్(3) షమీ చేతికి చిక్కాడు. దీంతో 153 పరుగుల(17.2వ ఓవర్) వద్ద లక్నో ఐదో వికెట్ కోల్పోయింది. 18 ఓవర్లకు లక్నో స్కోరు 155/5. స్వప్నిల్ సింగ్(1), ఆయుష్ బదోనీ(11)క్రీజులో ఉన్నారు.
17వ ఓవర్‌ను మహ్మద్ షమీ వేయగా 12 పరుగులు వచ్చాయి. రెండో బంతికి బదోని సిక్స్ కొట్టాడు. 17 ఓవర్లకు లక్నో స్కోరు 152/4. నికోలస్ పూరన్(3), ఆయుష్ బదోనీ(9)క్రీజులో ఉన్నారు.
లక్నో వరుసగా వికెట్లు కోల్పోతుంది. దూకుడుగా ఆడుతున్న డికాక్(70) రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 140 పరుగుల వద్ద లక్నో నాలుగో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు లక్నో స్కోరు 140/4. నికోలస్ పూరన్(1), ఆయుష్ బదోనీ(0)క్రీజులో ఉన్నారు.
లక్నో మరో వికెట్ కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్‌లో మహ్మద్ షమీ క్యాచ్ అందుకోవడంతో మార్కస్ స్టోయినిస్(4) ఔట్ అయ్యాడు. దీంతో 130 పరుగుల(14.5వ ఓవర్) వద్ద లక్నో మూడో వికెట్ కోల్పోయింది. 15 ఓవర్లకు లక్నో స్కోరు 130/3. క్వింటన్ డికాక్(61), నికోలస్ పూరన్(0) క్రీజులో ఉన్నారు
14వ ఓవర్‌ను నూర్ అహ్మద్ కట్టుదిట్టంగా వేయడంతో 4 పరుగులు వచ్చాయి. 14 ఓవర్లకు లక్నో స్కోరు 121/2. క్వింటన్ డికాక్(53), మార్కస్ స్టోయినిస్(3)క్రీజులో ఉన్నారు.
మహ్మద్ షమీ బౌలింగ్(12.1వ ఓవర్)లో డికాక్ సింగిల్ తీసి 31 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఆ మరుసటి బంతికే దీపక్ హుడా(11) తెవాటియా చేతికి చిక్కాడు. దీంతో 114పరుగుల వద్ద లక్నో రెండో వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు లక్నో స్కోరు 117/2. క్వింటన్ డికాక్(51), మార్కస్ స్టోయినిస్(2)క్రీజులో ఉన్నారు.
12వ ఓవర్‌ను రషీద్ ఖాన్ వేయగా 6 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు లక్నో స్కోరు 113/1. క్వింటన్ డికాక్(49), దీపక్ హుడా(11) క్రీజులో ఉన్నారు.
దూకుడుగా ఆడుతున్న కైల్ మేయర్స్(48) ఔట్ అయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించగా రషీద్ ఖాన్ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో లక్నో 88 పరుగుల(8.2వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది.
ఎనిమిదో ఓవర్‌ను నూర్ అహ్మద్ వేయగా 12 పరుగులు వచ్చాయి. డికాక్ రెండు ఫోర్లు కొట్టాడు. 8 ఓవర్లకు లక్నో స్కోరు 88/0. క్వింటన్ డికాక్(35), కైల్ మేయర్స్(48) లు క్రీజులో ఉన్నారు
ఏడో ఓవర్‌ను రషీద్ ఖాన్ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు లక్నో స్కోరు 76/0. క్వింటన్ డికాక్(26), కైల్ మేయర్స్(46) లు క్రీజులో ఉన్నారు.
ఆరో ఓవర్‌ను నూర్ అహ్మద్ వేయగా 8 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు లక్నో స్కోరు 72/0. క్వింటన్ డికాక్(24), కైల్ మేయర్స్(44) లు క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను రషీద్ ఖాన్ వేయగా 14 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి మేయర్స్ సిక్స్ కొట్టగా ఆఖరి బంతికి డికాక్ ఫోర్ బాదాడు. 5 ఓవర్లకు లక్నో స్కోరు 64/0. క్వింటన్ డికాక్(24), కైల్ మేయర్స్(36) లు క్రీజులో ఉన్నారు.
నాలుగో ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేయగా 15 పరుగులు వచ్చాయి. డికాక్ రెండు ఫోర్లు కొట్టగా, మేయర్స్ ఓ ఫోర్ బాదాడు. 4 ఓవర్లకు లక్నో స్కోరు 50/0. క్వింటన్ డికాక్(17), కైల్ మేయర్స్(29)లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను షమీ వేయగా 19 పరుగులు వచ్చాయి. డికాక్ రెండు ఫోర్లు కొట్టగా, మేయర్స్ ఓ సిక్స్, ఫోర్ బాదాడు. 3 ఓవర్లకు లక్నో స్కోరు 35/0. క్వింటన్ డికాక్(8), కైల్ మేయర్స్(25) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను హార్దిక్ పాండ్యా వేయగా 12 పరుగులు వచ్చాయి. కైల్ మేయర్స్ హ్యాట్రిక్ ఫోర్లు కొట్టాడు. 2 ఓవర్లకు లక్నో స్కోరు 16/0. క్వింటన్ డికాక్(0), కైల్ మేయర్స్(15) లు క్రీజులో ఉన్నారు.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు లక్నో జట్టు బరిలోకి దిగింది. క్వింటన్ డికాక్, కైల్ మేయర్స్ లు ఓపెనర్లుగా వచ్చారు. తొలి ఓవర్‌ను మహ్మద్ షమీ వేశాడు. 1 ఓవర్‌కు లక్నో స్కోరు 4/0. క్వింటన్ డికాక్(0), కైల్ మేయర్స్(3) లు క్రీజులో ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో భాగంగా అహ్మదాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants) తో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తలపడుతోంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్( 94నాటౌట్; 51 బంతుల్లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లు), వృద్ధిమాన్ సాహా(81; 43 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లు) ధంచికొట్టగా హార్ధిక్ పాండ్యా(25; 15 బంతుల్లో 1 పోర్, 2 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్(21 నాటౌట్; 12 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. లక్నో బౌలర్లలో మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్ చెరో వికెట్ పడగొట్టారు.
19వ ఓవర్‌ను అవేష్ ఖాన్ వేయగా 11 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి మిల్లర్ సిక్స్ బాదాడు.19 ఓవర్లకు గుజరాత్ స్కోరు 213/2. డేవిడ్ మిల్లర్(16), శుభమన్ గిల్ (85) లు క్రీజులో ఉన్నారు.
18వ ఓవర్‌ను యశ్ ఠాకూర్ వేయగా 8 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి మిల్లర్ ఫోర్ కొట్టాడు. 18 ఓవర్లకు గుజరాత్ స్కోరు 202/2. డేవిడ్ మిల్లర్(7), శుభమన్ గిల్ (83) లు క్రీజులో ఉన్నారు.
17వ ఓవర్‌ను అవేష్ ఖాన్ వేయగా 10 పరుగులు వచ్చాయి. నాలుగో బంతికి గిల్ ఫోర్ కొట్టాడు. 17 ఓవర్లకు గుజరాత్ స్కోరు 194/2. డేవిడ్ మిల్లర్(1), శుభమన్ గిల్ (81) లు క్రీజులో ఉన్నారు.
గుజరాత్ మరో వికెట్‌ను కోల్పోయింది. మొహ్సిన్ ఖాన్ బౌలింగ్‌లో హార్దిక్(25) కృనాల్ చేతికి చిక్కాడు. దీంతో 184 పరుగుల వద్ద గుజరాత్ రెండో వికెట్ కోల్పోయింది. 16 ఓవర్లకు గుజరాత్ స్కోరు 184/2. డేవిడ్ మిల్లర్(0), శుభమన్ గిల్ (73) లు క్రీజులో ఉన్నారు.
15 ఓవర్‌ను మార్కస్ స్టోయినిస్ వేయగా 20 పరుగులు వచ్చాయి. మొదటి బంతికి గిల్ సిక్స్ కొట్టగా, నాలుగు, ఐదు బంతులను పాండ్యా వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. 15 ఓవర్లకు గుజరాత్ స్కోరు 176/1. హార్దిక్ పాండ్యా(23), శుభమన్ గిల్ (67) లు క్రీజులో ఉన్నారు.
14 ఓవర్‌ను యశ్ ఠాకూర్ వేయగా 11 పరుగులు వచ్చాయి. ఐదో బంతికి హార్దిక్ సిక్స్ కొట్టాడు. 14 ఓవర్లకు గుజరాత్ స్కోరు 156/1. హార్దిక్ పాండ్యా(10), శుభమన్ గిల్ (60) లు క్రీజులో ఉన్నారు.
అవేష్ ఖాన్ బౌలింగ్‌లో బౌండరీ లైన్ వద్ద ప్రేరక్ మన్కడ్ చక్కటి క్యాచ్ అందుకోవడంతో సాహా(81) ఔట్ అయ్యాడు. దీంతో గుజరాత్ 142 పరుగుల(12.1వ ఓవర్) వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 13 ఓవర్లకు గుజరాత్ స్కోరు 145/1. హార్దిక్ పాండ్యా(2), శుభమన్ గిల్ (58) లు క్రీజులో ఉన్నారు.
కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో సింగిల్(11.1వ ఓవర్) తీసి శుభ్‌మన్ గిల్ 29 బంతుల్లో 4 సిక్సర్లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సాహా ఫోర్ కొట్టగా గిల్ సిక్స్ బాదడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. 12 ఓవర్లకు గుజరాత్ స్కోరు 142/0. వృద్ధిమాన్ సాహా(81), శుభమన్ గిల్ (57) లు క్రీజులో ఉన్నారు.
11వ ఓవర్‌ను స్వప్నిల్ సింగ్ వేయగా 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లకు గుజరాత్ స్కోరు 128/0. వృద్ధిమాన్ సాహా(75), శుభమన్ గిల్ (49) లు క్రీజులో ఉన్నారు.
పదో ఓవర్‌ను కృనాల్ పాండ్యా కట్టుదిట్టంగా వేయడంతో 6 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లకు గుజరాత్ స్కోరు 121/0. వృద్ధిమాన్ సాహా(74), శుభమన్ గిల్ (43) లు క్రీజులో ఉన్నారు
శుభ్‌మన్ గిల్ వేగం పెంచాడు. తొమ్మిదో ఓవర్‌ను బిష్ణోయ్ వేయగా గిల్ రెండు సిక్సర్లు బాదడంతో మొత్తంగా ఈ ఓవర్‌లో 17 పరుగులు వచ్చాయి. 9 ఓవర్లకు గుజరాత్ స్కోరు 115/0. వృద్ధిమాన్ సాహా(71), శుభమన్ గిల్ (40) లు క్రీజులో ఉన్నారు.
ఎనిమిదో ఓవర్‌ను కైల్ మేయర్స్ వేయగా 16 పరుగులు వచ్చాయి. సాహా మూడు ఫోర్లు బాదాడు. 8 ఓవర్లకు గుజరాత్ స్కోరు 98/0. వృద్ధిమాన్ సాహా(69), శుభమన్ గిల్ (26) లు క్రీజులో ఉన్నారు.
ఏడో ఓవర్‌ను రవి బిష్ణోయ్ కట్టుదిట్టంగా వేయడంతో నాలుగు పరుగులు వచ్చాయి. 7 ఓవర్లకు గుజరాత్ స్కోరు 82/0. వృద్ధిమాన్ సాహా(56), శుభమన్ గిల్ (24) లు క్రీజులో ఉన్నారు.
యశ్ ఠాకూర్ బౌలింగ్‌లో(5.1వ ఓవర్) సిక్స్‌తో వృద్ధిమాన్ సాహా 20 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అతడికి ఇది 12వ హాఫ్ సెంచరీ. ఈ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. 6 ఓవర్లకు గుజరాత్ స్కోరు 78/0. వృద్ధిమాన్ సాహా(54), శుభమన్ గిల్ (22) లు క్రీజులో ఉన్నారు.
ఐదో ఓవర్‌ను కృనాల్ పాండ్యా వేయగా 10 పరుగులు వచ్చాయి. ఆఖరి బంతికి గిల్ సిక్స్ కొట్టాడు. 5 ఓవర్లకు గుజరాత్ స్కోరు 63/0. వృద్ధిమాన్ సాహా(46), శుభమన్ గిల్ (15) లు క్రీజులో ఉన్నారు.
వృద్ధిమాన్ సాహా దూకుడుగా ఆడుతున్నాడు. మొహ్సిన్ ఖాన్ నాలుగో ఓవర్‌లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్‌లో 22 పరుగులు వచ్చాయి. 4 ఓవర్లకు గుజరాత్ స్కోరు 53/0. వృద్ధిమాన్ సాహా(46), శుభమన్ గిల్ (5) లు క్రీజులో ఉన్నారు.
మూడో ఓవర్‌ను కృనాల్ పాండ్యా వేయగా 8 పరుగులు వచ్చాయి. రెండో బంతికి సాహా ఫోర్ కొట్టాడు. 3 ఓవర్లకు గుజరాత్ స్కోరు 31/0. వృద్ధిమాన్ సాహా(25), శుభమన్ గిల్ (4) లు క్రీజులో ఉన్నారు.
రెండో ఓవర్‌ను ఆవేశ్ ఖాన్ వేయగా 11 పరుగులు వచ్చాయి. వృద్ధిమాన్ సాహా ఆఖరి రెండు బంతులకు వరుసగా సిక్స్, ఫోర్ కొట్టాడు. 2 ఓవర్లకు గుజరాత్ స్కోరు 23/0. వృద్ధిమాన్ సాహా(20), శుభమన్ గిల్ (1) లు క్రీజులో ఉన్నారు.
టాస్ ఓడిన గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేస్తోంది. వృద్ధిమాన్ సాహా, శుభమన్ గిల్ లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. మొదటి ఓవర్‌ను మొహ్సిన్ ఖాన్ వేశాడు. వృద్దిమాన్ సాహా రెండు ఫోర్లు కొట్టాడు. 1 ఓవర్‌కు గుజరాత్ స్కోరు 12/0. వృద్ధిమాన్ సాహా(10), శుభమన్ గిల్ (0) లు క్రీజులో ఉన్నారు.
క్వింటన్ డికాక్(వికెట్ కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కరణ్ శర్మ, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, స్వప్నిల్ సింగ్, యశ్ ఠాకూర్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, అవేష్ ఖాన్
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ
టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ కృనాల్ పాండ్యా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.