LSG Vs MI: ముంబైని చిత్తు చేసిన లక్నో.. Updates In Telugu
ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్ లో ముంబై పరాజయం పాలైంది.

LSG Vs MI
IPL: కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ చేతులెత్తేసింది. లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఓటమి పాలైంది. ఈ మ్యాచ్ లో 5 పరుగుల తేడాతో లక్నో విక్టరీ కొట్టింది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది. దాంతో పరాజయం పాలైంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో భాగంగా 63వ లీగ్ మ్యాచ్ జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయీ ఎకానా క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తలపడ్డాయి.
LIVE NEWS & UPDATES
-
ముంబై పరాజయం
ముంబై ఓడిపోయింది. లక్నో జట్టు 5 పరుగుల తేడాతో గెలుపొందింది. 178 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులే చేసింది.
-
6 బంతులు.. 11 పరుగులు టార్గెట్
19 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(29), కేమరూన్ గ్రీన్(2) క్రీజులో ఉన్నారు.
-
18 ఓవర్లకు స్కోర్ 148/5
18 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 5 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(15), కేమరూన్ గ్రీన్(2) క్రీజులో ఉన్నారు.
-
కష్టాల్లో ముంబై..
ముంబై జట్టు కష్టాల్లో పడింది. 5వ వికెట్ కోల్పోయింది. 145 పరుగుల జట్టు స్కోర్ వద్ద విష్ణు వినోద్(2) యశ్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
-
17 ఓవర్లకు స్కోర్ 139/4
17 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 4 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(13), విష్ణు వినోద్(1) క్రీజులో ఉన్నారు.
-
ఫోర్త్ వికెట్ డౌన్
ముంబై జట్టు 4వ వికెట్ కోల్పోయింది. 131 పరుగుల జట్టు స్కోర్ వద్ద నేహల్ వధేర్(16) మోసిన్ ఖాన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
-
16 ఓవర్లకు స్కోర్ 131/3
16 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. నేహల్ వధేరా(16), టిమ్ డేవిడ్(7) క్రీజులో ఉన్నారు.
-
15 ఓవర్లకు స్కోర్ 125/3
15 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 3 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. నేహల్ వధేరా(12), టిమ్ డేవిడ్(5) క్రీజులో ఉన్నారు.
-
థర్డ్ వికెట్ డౌన్, సూర్య ఔట్
ముంబై జట్టు మూడో వికెట్ కోల్పోయింది. 115 పరుగుల జట్టు స్కోర్ వద్ద సూర్యకుమార్ యాదవ్(7) యశ్ ఠాకూర్ బౌలింగ్ లో ఔటయ్యాడు
-
12 ఓవర్లకు ముంబై స్కోర్ 106/2
12 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 2 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (37), ఇషాన్ కిషన్(59) ఇద్దరినీ రవి బిష్ణోయ్ ఔట్ చేశాడు. సూర్యకుమార్ యాదవ్(4), నేహల్ వధేరా(2) క్రీజులో ఉన్నారు.
-
ముంబై సెకండ్ వికెట్ డౌన్
ముంబై జట్టు రెండో వికెట్ కోల్పోయింది. 103 పరుగుల జట్టు స్కోర్ వద్ద రెండో వికెట్ డౌన్ అయ్యింది. దంచికొడుతున్న ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ అయిన కాసేపటికే రవి బిష్ణోయ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. కిషన్ 39 బంతుల్లో 59 పరుగులు చేశాడు.
-
11 ఓవర్లకు ముంబై స్కోర్ 103/1
11 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు వికెట్ నష్టానికి 103 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ (37) బిష్ణోయ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఇషాన్ కిషన్(59), సూర్యకుమార్ యాదవ్(3) క్రీజులో ఉన్నారు.
-
ఇషాన్ కిషన్ ఫిఫ్టీ
ముంబై ఓపెనర్ ఇషాన్ కిషాన్ దంచికొడుతున్నాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 34 బంతుల్లోనే 53 పరుగులు సాధించాడు. అతడి స్కోర్ లో 7 ఫోర్లు, 1 సిక్స్ ఉన్నాయి.
-
10 ఓవర్లకు ముంబై స్కోర్ 92/1
10 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు వికెట్ నష్టానికి 92 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ(37) బిష్ణోయ్ బౌలింగ్ లో ఔటయ్యాడు.
-
9 ఓవర్లకు ముంబై స్కోర్ 82
9 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 74 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (46), రోహిత్ శర్మ(33) ధాటిగా బ్యాటింగ్ చేస్తున్నారు.
-
8 ఓవర్లకు ముంబై స్కోర్ 74
8 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 74 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(41), రోహిత్ శర్మ(30) ధాటిగా ఆడుతున్నారు.
-
7 ఓవర్లు ముంబై స్కోర్ 69
7 ఓవర్లు ముగిసే సరికి ముంబై జట్టు 69 పరుగులు చేసింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్(38), రోహిత్ శర్మ(28) ధాటిగా ఆడుతున్నారు.
-
ముంబై ఇండియన్స్ టార్గెట్ 178
ముంబై ఇండియన్స్ ముందు లక్నో సూపర్ జెయింట్స్ 178 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. లక్నో జట్టులో దీపక్ హూడా 5, డికాక్ 16, పెరాక్ 0, కృనాల్ పాండ్యా 49 (రిటైర్డ్ హర్ట్), స్టొయినిస్ 89(నాటౌట్), నికోలస్ 8(నాటౌట్) పరుగులు చేశారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో లక్నో స్కోరు 177/3గా నమోదైంది.
-
36 బంతుల్లో స్టొయినిస్ హాఫ్ సెంచరీ
స్టొయినిస్ 36 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. లక్నో స్కోరు 18 ఓవర్లకు 148/3గా ఉంది.
-
కృనాల్ పాండ్యా రిటైర్డ్ హర్ట్
లక్నో బ్యాటర్ కృనాల్ పాండ్యా 42 బంతుల్లో 49 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నికోలస్ 2 పరుగులకే ఔటయ్యాడు. క్రీజులో స్టొయినిస్ 42 పరుగులతో ఉన్నాడు. లక్నో స్కోరు 120/3 (16.3 ఓవర్ల వద్ద)గా ఉంది.
-
11 ఓవర్లకు 78/3
లక్నో స్కోరు 11 ఓవర్ల నాటికి 78/3గా ఉంది. క్రీజులో కృనాల్ పాండ్యా 36, స్టొయినిస్ 19 పరుగులతో ఉన్నారు.
-
మూడో వికెట్ డౌన్
లక్నో మూడో వికెట్ కోల్పోయింది. డికాక్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి వికెట్ కూడా జాసన్ బౌలింగ్ లోనే పడింది. స్కోరు ఏడు ఓవర్లకి 39/3 గా ఉంది.
-
వెనువెంటనే 2 వికెట్లు
లక్నో ఓపెనర్ దీపక్ హూడా మూడో ఓవర్ తొలి బంతికి ఔట్ అయ్యాడు. ఆ వెంటనే మూడో ఓవర్ రెండో బంతికే ప్రేరక్ క్యాచ్ ఔట్ గా వెనుదిరిగాడు. మూడో ఓవర్ ముంబై జట్టు ఆటగాడు జాసన్ వేశాడు. లక్నో స్కోరు 3 ఓవర్ల వద్ద 17/2గా ఉంది.
-
కృనాల్ సేన
లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టు: క్వింటన్ డి కాక్, దీపక్ హూడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుశ్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మోహ్సిన్ ఖాన్
-
రోహిత్ సేన
ముంబై ఇండియన్స్ తుది జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), ఇషాన్ కిషన్, కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూశ్ చావ్లా, జాసన్, ఆకాశ్
-
ముంబై బౌలింగ్
టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు.