IPL Playoffs 2023
IPL 2023 Playoffs schedule: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) 2023 సీజన్‌లో లీగ్ దశ ముగిసింది. హోరా హోరీ పోరాటాలు అభిమానులకు కనువిందు చేశాయి. చివరకు నాలుగు జట్లు ప్లే ఆఫ్స్‌కు చేరుకోగా ఆరు జట్లు ఇంటి ముఖం పట్టాయి. గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్( Chennai Super Kings), లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), ముంబై ఇండియన్స్(Mumbai Indians )లలో ఐపీఎల్ టైటిల్‌ను సాధించేది ఎవరో మరో నాలుగు మ్యాచుల్లో తేలనుంది.
మే 23 మంగళవారం నుంచి ప్లే ఆఫ్స్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. టాప్-2లో ఉన్న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ఫైనల్ చేరుకునేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్ మ్యాచ్‌లను ఆడనున్నాయి.
Virat Kohli: కోహ్లి మోకాలికి గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన ఆర్‌సీబీ హెడ్ కోచ్ బంగర్
ప్లే ఆఫ్స్ షెడ్యూల్ ఇదే..
క్వాలిఫైయర్ 1 : చెన్నైలోని చెపాక్ వేదికగా మే 23న గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టుకు మరో అవకాశం ఉంటుంది.
ఎలిమినేటర్ : మే 24 బుధవారం లక్నోసూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ ఆడనుండగా ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. ఈ మ్యాచ్‌కు కూడా చెన్నైలోని చెపాక్ స్టేడియమే అతిథ్యం ఇవ్వనుంది.
Shubman Gill: ఆర్‌సీబీ ఓటమికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోదరిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్..!
క్వాలిఫైయర్ 2 : మే 26 శుక్రవారం క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్లు మధ్య మ్యాచ్ జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఈ మ్యాచ్ గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది.
పైనల్ : మే 28 ఆదివారం ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిపైయర్‌లో గెలిచిన జట్టు, రెండో క్వాలిఫైయర్‌లో విజయం సాధించిన జట్టుకు మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కూడా గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలోనే జరుగుతుంది.
ఇక అన్ని మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అంతకు అర్ధగంట ముందు టాస్ వేస్తారు. మ్యాచ్‌లను జియో సినిమా యాప్‌లో ఉచితంగా చూడొచ్చు.