Shubman Gill: ఆర్‌సీబీ ఓట‌మికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోద‌రిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌..!

కొంద‌రు మాత్రం ఆర్‌సీబీ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ జ‌ట్టు ఓట‌మికి గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ కార‌ణం అంటూ అత‌డిని తిట్టిపోస్తున్నారు. అంత‌టితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియాలో గిల్‌ సోద‌రి షాహ‌నీల్ ను కూడా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు.

Shubman Gill: ఆర్‌సీబీ ఓట‌మికి ఆమెకు ఏమి సంబంధం..? గిల్ సోద‌రిని తిట్టిపోస్తున్న ఫ్యాన్స్‌..!

Shubman Gill and his sister Shahneel

Shubman Gill- Shahneel: అభిమానం హ‌ద్దులు దాట‌నంత వ‌ర‌కు మంచిదే. ఇష్టప‌డే ఆట‌గాళ్లు లేదా జ‌ట్టు ఓడిపోతే బాధ‌ప‌డ‌డం స‌హ‌జ‌మే. అందుకు ఎదుటి వాళ్లే కార‌ణం అంటూ వారిపై ద్వేషాన్ని పెంచుకోవ‌డం మాత్రం స‌రికాదు. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు(Royal Challengers Bangalore ) ఐపీఎల్(IPL) టైటిల్ ఆశ‌లు ఈ సారి కూడా ఆవిరి అయ్యాయి. ఆదివారం చిన్న‌స్వామి స్టేడియంలో గుజ‌రాత్ టైటాన్స్‌(Gujarat Titans)తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆర్‌సీబీ ఓడిపోయింది.

తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ.. కోహ్లి(101) అజేయ సెంచ‌రీ చేయ‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 197 ప‌రుగులు చేసింది. అనంత‌రం శుభ్‌మ‌న్ గిల్ శ‌త‌కం(104)తో చెల‌రేగ‌డంతో 19.1 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి గుజ‌రాత్ ల‌క్ష్యాన్ని అందుకుంది. దీంతో 20 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంతోనే గుజ‌రాత్ లీగ్ స్టేజ్‌ను ముగించింది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఐపీఎల్ టైటిల్ గెల‌వ‌ని బెంగ‌ళూరు ఈ సారి అయినా క‌ప్పును ముద్దాల‌ని బావించ‌గా.. క‌నీసం ప్లే ఆఫ్స్‌కు చేర‌కుండానే వెనుదిరిగింది. దీంతో ఆ జ‌ట్టు అభిమానుల్లో కొంద‌రు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. మ‌రికొంద‌రు మాత్రం ఆర్‌సీబీ ఓట‌మిని జీర్ణించుకోలేక‌పోతున్నారు. త‌మ జ‌ట్టు ఓట‌మికి గుజ‌రాత్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ కార‌ణం అంటూ అత‌డిని తిట్టిపోస్తున్నారు.

RCB vs GT: బెంగ‌ళూరుకు షాకిచ్చిన శుభ్‌మ‌న్‌ గిల్‌.. ఆర్‌సీబీ ఇంటికి.. ప్లే ఆఫ్స్‌కు ముంబై

అంత‌టితో ఆగ‌కుండా సోష‌ల్ మీడియా లో గిల్‌ సోద‌రి షాహ‌నీల్ ను కూడా అస‌భ్య ప‌ద‌జాలంతో దూషిస్తున్నారు. మ్యాచ్‌ను వీక్షించిన త‌రువాత గిల్ సోద‌రి త‌న సోష‌ల్ మీడియాలో కొన్ని ఫోటోల‌ను షేర్ చేసింది. ఎంతో సంతోష‌క‌ర‌మైన రోజు అంటూ దాని కింద క్యాప్ష‌న్ ఇచ్చింది. దీనిపై గిల్ అభిమానులు అభినంద‌న‌లు కురిపించ‌గా ఆర్‌సీబీ ఫ్యాన్స్ మాత్రం మండిప‌డుతున్నారు. రాయ‌లేని ప‌ద‌జాలంతో కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shahneel Gill (@shahneelgill)

వాళ్లు నిజ‌మైన అభిమానులు కాదు..

అంద‌రు ఆర్‌సీబీ అభిమానులు అలాగే చేస్తున్నారు అనుకుంటే పొర‌బ‌డిన‌ట్లే. విరాట్ కోహ్లి అద్భుత ఇన్నింగ్స్ వృథాగా పోయింద‌న్న బాధ‌ను తెలియ‌జేస్తూనే శుభ్‌మన్ గిల్ ఆట‌తీరును మెచ్చుకుంటున్నారు. గిల్‌ను, అత‌డి సోద‌రిని విమ‌ర్శించే వాళ్లు నిజ‌మ‌మైన అభిమానులు కాద‌ని, ఈ స‌మ‌యంలో సంయ‌మ‌నం పాటించాల‌ని హిత‌వు ప‌లుకుతున్నారు.

IPL 2023: కోహ్లీని మరోసారి టార్గెట్ చేసిన నవీన్ ఉల్‌హుక్!.. ఆర్సీబీ ఓటమి తరువాత వీడియో షేర్ చేసిన లక్నో ప్లేయర్