IPL 2023, SRH vs KKR: ఉత్కంఠ పోరులో స‌న్‌రైజ‌ర్స్‌పై కోల్‌క‌తా విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఉప్ప‌ల్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(Kolkata Knight Riders) విజ‌యం సాధించింది.

SRH vs KKR

IPL 2023, SRH vs KKR: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఉప్ప‌ల్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(Kolkata Knight Riders) విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 04 May 2023 11:24 PM (IST)

    కోల్‌క‌తా విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL) 2023లో భాగంగా ఉప్ప‌ల్ వేదికగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్(Sunrisers Hyderabad)తో జ‌రిగిన మ్యాచ్‌లో కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్(Kolkata Knight Riders) విజ‌యం సాధించింది. ల‌క్ష్యఛేద‌న‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 166 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. దీంతో కోల్‌క‌తా 5 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

  • 04 May 2023 11:19 PM (IST)

    అబ్దుల్ స‌మ‌ద్ ఔట్‌

    వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి బౌలింగ్‌లో అనుకుల్ రాయ్ క్యాచ్ అందుకోవడంతో అబ్దుల్ స‌మ‌ద్ (21) ఔట్ అయ్యాడు. దీంతో స‌న్‌రైజ‌ర్స్ 165 ప‌రుగుల(19.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద ఎనిమిదో వికెట్ కోల్పోయింది.

  • 04 May 2023 11:07 PM (IST)

    మార్కో జాన్సెన్ ఔట్

    మార్కో జాన్సెన్(1) ఔట్ అయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో వికెట్ కీప‌ర్ రహ్మానుల్లా గుర్బాజ్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 152 ప‌రుగుల(18.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఏడో వికెట్‌ను కోల్పోయింది. ఈ ఓవ‌ర్‌లో భువ‌నేశ్వ‌ర్, అబ్దుల్ స‌మ‌ద్ చెరో ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 12 ప‌రుగులు వ‌చ్చాయి. 19 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 163/7. అబ్దుల్ సమద్(20), భువ‌నేశ్వ‌ర్ కుమార్‌(5) లు క్రీజులో ఉన్నారు. స‌న్ రైజ‌ర్స్ విజ‌యానికి ఆఖ‌రి ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు కావాలి.

  • 04 May 2023 11:02 PM (IST)

    5 ప‌రుగులు

    18 ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 151/6. అబ్దుల్ సమద్(15), మార్కో జాన్సెన్(1) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:58 PM (IST)

    మార్‌క్ర‌మ్ ఔట్‌

    కీల‌క స‌మ‌యంలో మార్‌క్ర‌మ్‌(41) ఔట్ అయ్యాడు. వైభవ్ అరోరా బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన మార్‌క్ర‌మ్.. రింకూ సింగ్ చేతికి చిక్కాడు. దీంతో 145 ప‌రుగుల(16.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఆరో వికెట్ కోల్పోయింది. 17 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 146/6. అబ్దుల్ సమద్(13), మార్కో జాన్సెన్(1) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:52 PM (IST)

    4 ప‌రుగులు

    16వ ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో నాలుగు ప‌రుగులే వ‌చ్చాయి. 16 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 138/5. అబ్దుల్ సమద్(7), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(40) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:43 PM (IST)

    క్లాసెన్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించిన క్లాసెన్‌(36) ర‌స్సెల్ చేతికి చిక్కాడు. దీంతో 124 ప‌రుగుల(14.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ ఐదో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 134/5.అబ్దుల్ సమద్(5), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(38 లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:40 PM (IST)

    మార్‌క్ర‌మ్‌ ఫోర్‌

    14వ ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ వేశాడు. మార్‌క్ర‌మ్ ఓ ఫోర్ కొట్ట‌డంతో 10 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 124/4.హెన్రిచ్ క్లాసెన్(36), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(33) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:36 PM (IST)

    క్లాసెన్ సిక్స్‌

    ప‌ద‌మూడో ఓవ‌ర్‌ను హర్షిత్ రాణా వేశాడు. ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి బంతికి క్లాసెన్ సిక్స్ కొట్ట‌డంతో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 114/4. హెన్రిచ్ క్లాసెన్(34), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(25) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:30 PM (IST)

    మార్‌క్ర‌మ్ రెండు ఫోర్లు

    ప‌న్నెండో ఓవ‌ర్‌ను వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి వేయ‌గా మార్‌క్ర‌మ్ రెండు ఫోర్లు కొట్టడంతో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 12 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 102/4. హెన్రిచ్ క్లాసెన్(26), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(22) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:25 PM (IST)

    క్లాసెన్ రెండు సిక్స్‌లు

    ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను అనుకుల్ రాయ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో క్లాసెన్ రెండు సిక్స‌ర్లు బాద‌డంతో 15 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 90/4. హెన్రిచ్ క్లాసెన్(25), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(11) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:22 PM (IST)

    ఆరు ప‌రుగులు

    ప‌దో ఓవ‌ర్‌ను సునీల్ న‌రైన్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఆరు ప‌రుగులే వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 75/4. హెన్రిచ్ క్లాసెన్(11), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(10) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:16 PM (IST)

    3 ప‌రుగులు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను అనుకుల్ రాయ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 3 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 69/4. హెన్రిచ్ క్లాసెన్(8), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(7) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:13 PM (IST)

    5 ప‌రుగులు

    ఎనిమిద ఓవ‌ర్‌ను శార్దూల్ ఠాకూర్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 66/4. ,హెన్రిచ్ క్లాసెన్(6), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(6) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:06 PM (IST)

    హ్యారీ బ్రూక్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్ మ‌రో వికెట్ కోల్పోయింది. అనుకుల్ రాయ్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్(0) ఎల్భీగా ఔట్ అయ్యాడు. దీంతో 54 ప‌రుగుల(6.2వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ నాలుగో వికెట్ కోల్పోయింది. 7 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 61/4. ,హెన్రిచ్ క్లాసెన్(5), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(2) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 10:01 PM (IST)

    రాహుల్ త్రిపాఠి ఔట్‌

    దూకుడుగా పెంచిన రాహుల్ త్రిపాఠి(20) ఔట్ అయ్యాడు. ఆండ్రూ ర‌స్సెల్ బౌలింగ్‌లో వ‌రుస‌గా రెండు ఫోర్లు, ఓ సిక్స్ కొట్టిన త్రిపాఠి అదే ఊపులో మ‌రో భారీ షాట్‌కు య‌త్నించి వైభవ్ అరోరా చేతికి చిక్కాడు. దీంతో 53 ప‌రుగుల(5.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ మూడో వికెట్ కోల్పోయింది. 6 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 53/3. హ్యారీ బ్రూక్‌(0), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:56 PM (IST)

    1 ప‌రుగు

    ఐదో ఓవ‌ర్‌ను హ‌ర్షిత్ రాణా క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 5 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 38/2. , రాహుల్ త్రిపాఠి(6), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:51 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్‌కు వ‌రుస‌గా షాకులు త‌గులుతున్నాయి. అభిషేక్ శ‌ర్మ‌(9) ఔట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో ఆండ్రీ ర‌స్సెల్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 37 ప‌రుగుల(3.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ రెండో వికెట్ కోల్పోయింది. 4 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 37/2. , రాహుల్ త్రిపాఠి(5), ఐడెన్ మార్‌క్ర‌మ్‌(0) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:44 PM (IST)

    మ‌యాంక్ అగ‌ర్వాల్ ఔట్‌

    స‌న్‌రైజ‌ర్స్‌కు షాక్ త‌గిలింది. మ‌యాంక్ అగ‌ర్వాల్(18) ఔట్ అయ్యాడు. హర్షిత్ రాణా బౌలింగ్‌లో రహ్మానుల్లా గుర్బాజ్ చేతికి చిక్కాడు. దీంతో 29 ప‌రుగుల(2.5వ ఓవ‌ర్‌) వ‌ద్ద స‌న్‌రైజ‌ర్స్ తొలి వికెట్ కోల్పోయింది. 3 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 29/1. అభిషేక్ శ‌ర్మ‌(6), రాహుల్ త్రిపాఠి(0) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:38 PM (IST)

    మ‌యాంక్ అగ‌ర్వాల్ రెండు ఫోర్లు

    రెండో ఓవ‌ర్‌ను వైభవ్ అరోరా వేశాడు. మ‌యాంక్ అగ‌ర్వాల్ రెండు ఫోర్లు కొట్ట‌డంతో మొత్తంగా 13 ప‌రుగులు వ‌చ్చాయి. 2 ఓవ‌ర్ల‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 22/0. అభిషేక్ శ‌ర్మ‌(6), మయాంక్ అగర్వాల్(12) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:32 PM (IST)

    అభిషేక్ శ‌ర్మ ఫోర్‌

    ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు స‌న్‌రైజ‌ర్స్ బ‌రిలోకి దిగింది. అభిషేక్ శ‌ర్మ‌, మయాంక్ అగర్వాల్ లు ఓపెన‌ర్లుగా వ‌చ్చారు. తొలి ఓవ‌ర్‌ను హర్షిత్ రాణా వేశాడు. మొద‌టి బంతికే అభిషేక్ శ‌ర్మ ఫోర్ కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు స‌న్‌రైజ‌ర్స్ స్కోరు 9/0. అభిషేక్ శ‌ర్మ‌(5), మయాంక్ అగర్వాల్(2) లు క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:10 PM (IST)

    స‌న్‌రైజ‌ర్స్ ల‌క్ష్యం 172

    టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌క‌తా ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 171 ప‌రుగులు చేసింది. కోల్‌క‌తా బ్యాట‌ర్ల‌లో రింకూ సింగ్‌(46; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌), నితీశ్ రాణా(42; 31 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) రాణించ‌గా ఆండ్రీ ర‌స్సెల్‌(24; 15 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స‌ర్లు) ప‌ర్వాలేద‌నిపించాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో మార్కో జాన్సెన్, న‌ట‌రాజ‌న్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా, భువ‌నేశ్వ‌ర్ కుమార్‌, కార్తీక్ త్యాగి, మార్‌క్ర‌మ్‌, మ‌యాంక్ మార్కండే ఒక్కొ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 04 May 2023 09:05 PM (IST)

    అనుకుల్ రాయ్ రెండు ఫోర్లు

    19వ ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. మూడు, నాలుగు బంతుల‌ను అనుకుల్ రాయ్ బౌండ‌రీలుగా మ‌లిచాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి.19 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 168/7. రింకూ సింగ్‌(46), అనుకుల్ రాయ్(12) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 09:01 PM (IST)

    శార్దూల్ ఔట్

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. శార్దూల్ ఠాకూర్(8) ఔట్ అయ్యాడు. న‌ట‌రాజ‌న్ బౌలింగ్‌లో అబ్దుల్ స‌మ‌ద్‌ చేతికి చిక్కాడు. దీంతో 151 ప‌రుగుల(17.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా ఏడో వికెట్ కోల్పోయింది. 18 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 155/7. రింకూ సింగ్‌(42), అనుకుల్ రాయ్(3) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:55 PM (IST)

    రింకూ సింగ్ సిక్స్‌

    17వ ఓవ‌ర్‌ను మ‌యాంక్ మార్కండే వేశాడు. ఐదో బంతికి రింకూ సింగ్ సిక్స్ బాద‌డంతో మొత్తంగా 11 ప‌రుగులు వ‌చ్చాయి. 17 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 148/6. రింకూ సింగ్‌(38), శార్దూల్ ఠాకూర్(8) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:47 PM (IST)

    సునీల్ న‌రైన్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. సునీల్ న‌రైన్(1) ఔట్ అయ్యాడు. భువ‌నేశ్వ‌ర్ కుమార్ బౌలింగ్‌లో మ‌యాంక్ అగ‌ర్వాల్ చేతికి చిక్కాడు. దీంతో 130 ప‌రుగుల(15.3వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా ఆరో వికెట్ కోల్పోయింది. 16 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 137/6. రింకూ సింగ్‌(29), శార్దూల్ ఠాకూర్(6) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:42 PM (IST)

    ర‌స్సెల్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. మ‌యాంక్ మార్కండే బౌలింగ్‌లో న‌ట‌రాజ‌న్ క్యాచ్‌ అందుకోవ‌డంతో ఆండ్రీ ర‌స్సెల్‌(24) పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 127 ప‌రుగుల(14.2వ ఓవ‌ర్) వ‌ద్ద కోల్‌క‌తా ఐదో వికెట్ కోల్పోయింది. 15 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 129/5. రింకూ సింగ్‌(28), సునీల్ న‌రైన్‌(1) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:40 PM (IST)

    ర‌స్సెల్ ఫోర్‌

    14వ ఓవ‌ర్‌ను న‌ట‌రాజ‌న్ వేశాడు. ఐదో బంతికి ర‌స్సెల్ ఫోర్‌ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు వ‌చ్చాయి. 14 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 127/4. ఆండ్రీ ర‌స్సెల్‌(24), రింకూ సింగ్‌(27) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:35 PM (IST)

    సిక్స్‌, ఫోర్‌

    13వ ఓవ‌ర్‌ను మ‌యాంక్ మార్కండే వేశాడు. రెండో బంతికి ర‌స్సెల్ సిక్స్ కొట్ట‌గా ఆఖ‌రి బంతికి రింకూ సింగ్ ఫోర్ బాద‌డంతో మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 11 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 114/4. ఆండ్రీ ర‌స్సెల్‌(14), రింకూ సింగ్‌(26) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:30 PM (IST)

    నితీశ్ రాణా ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. మార్‌క్ర‌మ్ బౌలింగ్‌లో అత‌డే క్యాచ్ అందుకోవ‌డంతో నితీశ్ రాణా(42) పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 96 ప‌రుగుల(11.2వ ఓవ‌ర్) వ‌ద్ద కోల్‌క‌తా నాలుగో వికెట్ కోల్పోయింది. 12 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 103/4. ఆండ్రీ ర‌స్సెల్‌(7), రింకూ సింగ్‌(22) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:27 PM (IST)

    5 ప‌రుగులు

    మ‌యాంక్ మార్కండే ప‌ద‌కొండో ఓవ‌ర్‌ను క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 11 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 95/3. నితీశ్ రాణా(42), రింకూ సింగ్‌(21) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:25 PM (IST)

    రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌

    నితీశ్ రాణా దూకుడు పెంచాడు. కార్తీక్ త్యాగి తొమ్మిదో ఓవ‌ర్‌ను వేయ‌గా రెండు సిక్స్‌లు, ఓ ఫోర్ కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో 17 ప‌రుగులు వ‌చ్చాయి. 10 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 90/3. నితీశ్ రాణా(40), రింకూ సింగ్‌(18) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:15 PM (IST)

    రింకూ సింగ్ రెండు ఫోర్లు

    తొమ్మిదో ఓవ‌ర్‌ను మార్‌క్ర‌మ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో రింకూ సింగ్ వ‌రుస‌గా రెండు ఫోర్లు కొట్ట‌డంతో 12 ప‌రుగులు వ‌చ్చాయి. 9 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 73/3. నితీశ్ రాణా(24), రింకూ సింగ్‌(17) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:11 PM (IST)

    నితీశ్ రాణా సిక్స్

    ఎనిమిదో ఓవ‌ర్‌ను నట‌రాజ‌న్ వేశాడు. రెండో బంతికి నితీశ్ రాణా సిక్స్ బాదడంతో ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వచ్చాయి. 8 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 61/3. నితీశ్ రాణా(22), రింకూ సింగ్‌(8) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:09 PM (IST)

    5 ప‌రుగులు

    ఏడో ఓవ‌ర్‌ను మార్‌క్ర‌మ్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 54/3. నితీశ్ రాణా(15), రింకూ సింగ్‌(8) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 08:04 PM (IST)

    9 ప‌రుగులు

    కోల్‌క‌తా ఇన్నింగ్స్‌లో ప‌వ‌ర్ ప్లే ముగిసింది. ఆరో ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేశాడు. తొలి బంతికి నితీశ్ రాణా ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 9 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 49/3. నితీశ్ రాణా(12), రింకూ సింగ్‌(6) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:58 PM (IST)

    జేస‌న్ రాయ్ ఔట్‌

    కోల్‌క‌తా మ‌రో వికెట్ కోల్పోయింది. జేస‌న్ రాయ్‌(20) ఔట్ అయ్యాడు. కార్తీక్ త్యాగి బౌలింగ్‌లో మ‌యాంక్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో 35 ప‌రుగుల(4.4వ ఓవ‌ర్‌) వ‌ద్ద కోల్‌క‌తా మూడో వికెట్ కోల్పోయింది. 5 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 40/3. నితీశ్ రాణా(5), రింకూ సింగ్‌(4) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:51 PM (IST)

    నితీశ్ రాణా ఫోర్‌

    నాలుగో ఓవ‌ర్‌ను మార్కో జాన్సెన్ వేయ‌గా నితీశ్ రాణా ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 5 ప‌రుగులు వ‌చ్చాయి. 4 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 27/2. నితీశ్ రాణా(5), జేసన్ రాయ్(14) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:47 PM (IST)

    4 ప‌రుగులు

    మూడో ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. మూడో బంతికి రాయ్ ఫోర్ కొట్టాడు. 3 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 20/2. నితీశ్ రాణా(0), జేసన్ రాయ్(13) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:42 PM (IST)

    వెంక‌టేశ్ అయ్య‌ర్ ఔట్‌

    ఒకే ఓవ‌ర్‌లో కోల్‌క‌తా రెండు వికెట్లు కోల్పోయింది. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో తొలి బంతికి రహ్మానుల్లా గుర్బాజ్  ఔట్ కాగా ఆఖ‌రి బంతికి వెంక‌టేశ్ అయ్య‌ర్‌(7) వికెట్ కీప‌ర్ క్లాసెన్ చేతికి చిక్కాడు. 2 ఓవ‌ర్ల‌కు కోల్‌క‌తా స్కోరు 16/2. నితీశ్ రాణా(0), జేసన్ రాయ్(9) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:37 PM (IST)

    రహ్మానుల్లా గుర్బాజ్ డ‌కౌట్‌

    కోల్‌క‌తాకు షాక్ త‌గిలింది. రహ్మానుల్లా గుర్బాజ్ డ‌కౌట్ అయ్యాడు. మార్కో జాన్సెన్ బౌలింగ్‌లో హ్యారీ బ్రూక్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. దీంతో కోల్‌క‌తా 8 ప‌రుగుల(1.1వ ఓవ‌ర్‌) వ‌ద్ద తొలి వికెట్ కోల్పోయింది.

  • 04 May 2023 07:34 PM (IST)

    జేస‌న్ రాయ్ రెండు ఫోర్లు

    టాస్ గెలిచిన కోల్‌క‌తా బ్యాటింగ్ ఎంచుకుంది. రహ్మానుల్లా గుర్బాజ్, జేసన్ రాయ్ లు ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగారు. తొలి ఓవ‌ర్‌ను భువ‌నేశ్వ‌ర్ కుమార్ వేశాడు. జేస‌న్ రాయ్ రెండు ఫోర్లు కొట్టాడు. 1 ఓవ‌ర్‌కు కోల్‌క‌తా స్కోరు 8/0. రహ్మానుల్లా గుర్బాజ్(0), జేసన్ రాయ్(8) క్రీజులో ఉన్నారు.

  • 04 May 2023 07:11 PM (IST)

    కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జ‌ట్టు

    రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీప‌ర్‌), జేసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి

  • 04 May 2023 07:11 PM (IST)

    స‌న్‌రైజర్స్ హైదరాబాద్ తుది జ‌ట్టు

    మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్‌రామ్ (కెప్టెన్‌), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీప‌ర్‌), హ్యారీ బ్రూక్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, కార్తీక్ త్యాగి, టి నటరాజన్

  • 04 May 2023 07:03 PM (IST)

    టాస్ గెలిచిన కోల్‌క‌తా

    ఉప్ప‌ల్ వేదిక‌గా స‌న్‌రైజ‌ర్స్‌తో జ‌రుగుతున్న మ్యాచ్‌లో కోల్‌క‌తా టాస్ గెలిచింది. ఆ జ‌ట్టు కెప్టెన్ నితీశ్ రాణా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.