Rohit sharma
Rohit sharma : క్రికెట్ ఆటగాళ్లకు భారత్ లో అభిమానులు ఎక్కువే. సినీహీరోల తరహాలో క్రికెట్ ప్లేయర్స్ ను అభిమానిస్తుంటారు. వారు కనిపిస్తే చాలు ఫొటోలు దిగేందుకు, ఆటోగ్రాఫ్ కోసం పోటీ పడుతుంటారు. ముఖ్యంగా సచిన్, గంగూలీ, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ఆటగాళ్లను కలిసేందుకు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాజాగా వాంఖడే స్టేడియంలో ప్రాక్టీస్ సమయంలో ఓ మహిళా అభిమాని ముంబై జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వద్దకు వచ్చి తన అభిమానాన్ని చాటుకుంది.
Also Read : IPL 2024 : చెలరేగిన బట్లర్, శాంసన్.. బెంగళూరుపై రాజస్థాన్ విజయ దుందుభి
ముంబై ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఆదివారం మధ్యాహ్నం వాంఖడే స్టేడియంలో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా రోహిత్ స్టేడియంలో ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ప్రాక్టీస్ అనంతరం జట్టులోని పలువురు సభ్యులతో ముచ్చటిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ మహిళా అభిమాని రోహిత్ శర్మ వద్దకు వచ్చింది. మహిళ రాగానే రోహిత్ శర్మ పాదాలకు నమస్కారం చేసింది. దీంతో ఒక్కసారిగా ఆమెను రోహిత్ శర్మ వద్దంటూ వారించాడు. అనంతరం మహిళ తన చేతితోగీసిన రోహిత్ శర్మ చిత్రంను చూపించి దానిపై ఆటోగ్రాఫ్ ఇవ్వాలని కోరింది. రోహిత్ ఆటోగ్రాఫ్ ఇవ్వటంతోపాటు ఆ మహిళా అభిమానితో కలిసి ఫొటో దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : ఐపీఎల్-2024లో మొట్టమొదటి సెంచరీ బాదిన కోహ్లీ.. అత్యధిక సెంచరీలు చేసింది వీరే..
ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ లు ఆడింది. మూడు మ్యాచ్ లలోనూ ఓటమిపాలై పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. ఆదివారం మధ్యాహ్నం వాంఖడే స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది.
A fan meets Rohit Sharma & touches his feet at the Wankhede stadium. ? pic.twitter.com/LsWwFUCbRg
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 6, 2024